18 May, 2026 | 3:03 AM

పాలమూరు- ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి

18-05-2026 01:47 AM

అలంపూర్ మే 17: ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను త్వరితగ తిన పూర్తి చేసి అట్టి ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించాలని తెలంగాణ మలి దశ ఉద్యమ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ మేరకు కర్నూలులోని ఎమ్మెల్సీ కార్యాలయంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడును వారు కలిసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చొరవ తీసుకోవాలని వినతి పత్రాన్ని అందించారు. పాలమూరు జిల్లా రైతులకు నష్టం చేకూరుస్తున్న దిండి ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ వలిసార్, కన్వీనర్ ఇల్లూరి వెంకట్రామయ్య శెట్టి, మున్సిపల్ చైర్మన్ పిండి జయరాములు, మాజీ ఎంపీపీ సుదర్శన్ గౌడ్, మాజీ టెంపుల్ చైర్మన్ నారాయణ రెడ్డి, కౌన్సిలర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.