45 వేల గన్నీ సంచుల పంపిణీ
రెవెన్యూ అదనపు కలెక్టర్ జెఎల్బి హరిప్రియ
మహబూబ్ నగర్ మే 17 (విజయక్రాంతి) : వరి ధాన్యం అవసరమైన గన్ని సంచులు అందుబాటులో ఉన్నాయని రెవెన్యూ అదనపు కలెక్టర్ జెఎల్బి హరిప్రియ అన్నారు. ఆదివారం ఆదివారం జడ్చర్ల కాటన్ మార్కెట్ యార్డును సందర్శించి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తగిన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేయాలని, గన్నీ సంచులు సమృద్ధిగా నిల్వ ఉంచాలని సూచించారు.
జిల్లా పౌర సరఫరల సంస్థ డి.యం రవి నాయక్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ తో కలిసి అడ్డాకుల మండలంలోని బాలీద్పల్లి, కన్మనూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను వెంటనే ట్రాక్టర్ల ద్వారా తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. కన్మనూర్ కేంద్రానికి ఆర్టీవో శాఖ ద్వారా ప్రత్యేకంగా ఒక లారీని ఏర్పాటు చేసి ధాన్యాన్ని రైస్ మిల్లులకు వేగంగా తరలించేలా చర్యలు చేపట్టారు.
అలాగే మండలంలో అన్ని కొనుగోలు కేంద్రాలకు అదనపు ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ధాన్యం రావణ వేగవంతం చేయాలని అడ్డాకుల ఎపియం ను ఆదేశించారు. మండలంలో రవాణా వాహనాల కొరతను అధిగమించేందుకు మహబూబ్నగర్ నుంచి ఏడు లారీలు, అడ్డాకుల చెక్పోస్ట్ నుంచి ఐదు లారీలను సమీకరించి సమీప కొనుగోలు కేంద్రాలకు పంపించారు. గన్నీ సంచుల కొరతను నివారించేందుకు వేముల, నందిపేట్, కొమిరెడ్డిపల్లి, భూత్పూర్, మద్దిగట్ల, కరివేన, జనంపేట్, పొన్నకల్, బాలీద్పల్లి కేంద్రాలకు ఐదు వేల గన్నీ సంచులను సరఫరా చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 45 వేల గన్నీ సంచులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.






