24 August, 2026 | 2:30 AM

భూ కబ్జాదారుల నుంచి పార్క్‌ను కాపాడాలి

24-08-2026 01:59 AM
  1. ఎంపీ కొండా విశేశ్వర్ రెడ్డి
  2. పార్క్ స్థలాన్ని హెచ్‌ఎండీఏ వేలం వేయకూడదు
  3. పార్క్ స్థలంలో పడుకొని నిరసన తెలిపిన ఎంపీ

కూకట్ పల్లి, ఆగస్టు 23,(విజయక్రాంతి ): పార్క్ స్థలాన్ని భూ కబ్జాదారుల నుండి కాపాడాలంటూ, హెచ్‌ఎండిఏ వేలం వేయకుండా వెనక్కి తీసుకోవాలంటూ చేవెళ్ల ఎం పీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మిత్ర హిల్స్ కాలనీ లోని పార్క్ లోబిజెపి నాయకుడు రవికుమార్ యాదవ్ తో కలిసి వినూత్నంగా నిర సన చేశారు. స్థానిక కాలనీవాసులతో కలిసి పార్క్ స్థలాన్ని కాపాడాలంటూ పార్కులో పడుకొని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం కాంక్రీట్ జం గల్ గా మారుతుందని గతంలో ఈ ప్రా ంతంలో పార్కులు ప్రభుత్వ భూములు ఉం డేవని భూ కబ్జాదారుల కండ్లు పార్కులు ఆట స్థలాల పై పడి కబ్జాలకు పాల్పడ్డారన్నా రు.

రెండు సంవత్సరాల క్రితం ఈ పార్కును కొంతమంది కబ్జాదారులు కబ్జాకు యత్నిస్తే అప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆపామన్నారు. అధికార పార్టీలో ఉంటేనే తనకు లాభం జరుగుతుందని ఎమ్మెల్యే ఎప్పుడు అధికారం లో వున్న పార్టీ లో చేరుతుంటాడని ప్రజల వైపున ఉండి పనిచేయాల్సిన స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పై విమర్శలు చేశారు. అధికార పార్టీ లో ఉన్న ఎమ్మెల్యే పార్క్ స్థలం వేలాన్ని ఎందుకు ఆపడం లేదంటూ ప్రశ్నించారు.

పార్క్ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయరాదంటూ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. పెద్దలు, వృద్ధులకు వాకింగ్ ప్లేస్ లు,పిల్లలకు ఆట స్థలాలు లేకుండా ప్రభుత్వ స్థలాలను వేలం వేయడం ఆపాలంటూ డిమాండ్ చేశారు. ఇక్కడ పార్క్ ఉండేది, ఉంటుంది అని ప్రభుత్వం ఈ పార్క్ స్థలాన్ని  వేలం ఎలా వేస్తారని స్థానికులు అందరిని బొందపెట్టి వేలం వేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించారు. బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం అప్పటి మున్సిపల్ వైస్ చైర్మన్ కృష్ణా రావు ఒక ఎకరా 27 గుంటల స్థలాన్ని పార్కు స్థలంగా నిర్ణయించి ప్రభుత్వానికి అప్పగించారన్నారు. ఆ స్థలం కబ్జాలకు గురికాగా ఇప్పుడు 2000 గజాలు మాత్రమే మిగిలింది అన్నారు.

ఇట్టి పార్క్ స్థలాన్ని ప్రభుత్వం వేలం వేయడం సరికాదన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఈ పార్కు స్థలం కోసం స్థానికులతో కలిసి పోరాడుతున్నామని, ప్రభుత్వం ఆక్షన్ లిస్టు నుండి ఈ స్థలాన్ని తొలగించాలని కోరారు. పార్కు స్థలాన్ని కాపాడడం కోసం ఎంత దాకా అయినా వెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అరుణ్, రాజు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.