calender_icon.png 8 July, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ ప్రకటన హాస్యాస్పదం

08-07-2025 12:00:00 AM

మస్క్ గాడి తప్పాడు: ట్రంప్

వాషింగ్టన్, జూలై 7: అమెరికా అధ్యక్షుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య నెలకొన్న వైరం ముదిరింది. ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూ టిపుల్ బిల్లును వ్యతిరేకించిన మస్క్, అందరూ భావించినట్టే కొత్త పార్టీని ప్రకటించారు. దీనిపై ట్రంప్ స్పం దిస్తూ మస్క్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మస్క్ పార్టీ ప్రకటన హాస్య స్పదమని, అతడు పూర్తిగా గాడితప్పాడని మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.

‘ఐదు వా రాలుగా ఎలాన్ మస్క్ పూర్తిగా విచక్షణ కోల్పోయాడు. ఇది విచారకరం. మా మధ్య బంధాన్ని దారుణంగా ముగించే స్థితికి మస్క్ చేరకున్నారు. అమెరికాలో మూడో రాజకీయ పార్టీ అనేది విజయవంతం కాదని, అలాం టి వ్యవస్థను అమెరికన్లు అంగీకరించరని చరిత్ర చెబుతుంది. అయినా కొత్త పార్టీ పెట్టేందుకు మస్క్ సిద్ధమయ్యారు. రెండు పార్టీల వ్యవస్థ కొనసాగుతున్న దేశంలో మూడో పార్టీ గందరగోళానికి, ఘర్షణలకు తావిస్తుంది’ అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.