calender_icon.png 8 July, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

08-07-2025 12:00:00 AM

  1. క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అనుమానంతో
  2. బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో ఘటన

పట్నా, జూలై 7: బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెం దిన ఐదుగురిని చంపిన ఘటన పూర్ణియా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పూర్ణియా జిల్లా టెట్‌గామా గ్రామంలో ఇటీవల కొందరు వ్యక్తులు వరుసగా మరణించగా.. చాలా మంది అనా రోగ్యం బారిన పడ్డారు. గ్రామానికి చెందిన సీతా దేవి (48) క్షుద్ర పూజలు చేయడం వల్లే ఇదంతా జరుగుతుందని గ్రామస్థులు భావించారు. దీంతో ఆదివారం రాత్రి ఒక చోట చేరిన ఉరి వాళ్లందరూ సీతా దేవి కు టుంబాన్ని చంపాలని నిర్ణయించారు.

సోమవారం పంచాయితీకి పిలిపించి సీతాదేవి, భ ర్త బాబులాల్  ఒరాన్ (50), అత్త కాటో దేవి (65), కుమారుడు మంజిత్ ఒరాన్ (25), కోడలు రాని దేవి (23) దారుణంగా కొట్టి చ ంపారు. ఆ తర్వాత నిప్పు పెట్టి దహనం చే శారు. అయితే ఆ కుటుంబం నుంచి ప్రాణాలతో బయటపడిన ఒక పిల్లవాడు పో లీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసుల కు డాగ్ స్కాడ్‌తో గ్రామానికి వెళ్లారు. సమీపంలోని చెరువులో కాలిన మృ తదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.