బీఆర్‌ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు భద్రత లేదు.
మాజీ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ చైర్మెన్ ఇంతియాజ్ ఇసాక్
వనపర్తి, మార్చి 29 (విజయక్రాంతి): అక్షర కాన్సెప్ట్ స్కూల్ లో ఇటీవల జరిగిన సంఘట న సమాజానికి తలవంపు అని సంఘటనపై జిల్లా మంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం శోచనీయం అని మాజీ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ చైర్మెన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. చిన్నారి బాలికపై జరిగిన దారుణ ఘటన ఈ సమాజాన్ని కుదిపేసిందని నిందితుడిని అరెస్ట్ చేయడం స్వాగతించదగ్గ విషయం కానీ అది సరిపోదన్నారు.
అరెస్ట్ ఒక మొదటి అడుగు మాత్రమే న్యాయం కాదని ఈ ఘటనను దాచిపె ట్టడానికి ప్రయత్నించినవారు ఎవరు? స్కూల్ యాజమాన్యం బాధిత ఇంటికి వెళ్లి సెటిల్మెంట్ ఎందుకు ప్రయత్నించింది? ఎందుకు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు? స్కూల్ యా జమాన్యంపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నేరాన్ని దాచిపెట్టడం కూడా నేరమేనన్నారు. బాధితురాలికి న్యాయం కోరిన మా నాయకులపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు భద్రత లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మైనార్టీ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్,తదితరులు పాల్గొన్నారు




