31 July, 2026 | 12:50 AM

గురుమార్గం ప్రతిఒక్కరికీ ఆదర్శనీయం

31-07-2026 12:08 AM
  1. ముచ్చింతలలో ఘనంగా ‘గురువందన’
  2. పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి) : గురువు చూపే ధర్మమార్గం, సమాజ సేవకు అవసరమైన విలువలు, వినయం, నిస్వార్థ సేవా భావం ప్రతీ ఒక్కరికీ ఆదర్శమని బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ అన్నారు. ముచ్చింతల ఆశ్రమంలో గురువారం గురుపూర్ణిమ సందర్భంగా నిర్వహించిన ‘గురువందన’లో అధ్యక్షుడు ఆనంద్ గౌడ్‌తోపాటు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ మీడియా సభ్యుడు పెరిక సురేష్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి ఎ రమేష్, రాష్ట్ర కార్యదర్శి సుమన్, నర్సింగి, ప్రభు పూజారితోపాటు పలువురు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామికి గురువందనం సమర్పించి ఆశీర్వచనాలు పొందారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు సమాజసేవలో మరింత అంకితభావంతో పనిచేసేలా స్ఫూర్తినిస్తాయన్నారు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ధర్మమార్గంలో నడింపించే దివ్యశక్తే గురువు అన్నారు. గురువుల ఆశీస్సులతో దేశ, సమాజ సేవలో మరింత నిబద్ధతతో పనిచేయాలని సంకల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.