calender_icon.png 1 February, 2026 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకీకి జోడీ?

01-02-2026 01:15:26 AM

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో ’సెన్సేషనల్ డైరెక్టర్’గా ఎదిగిన అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాని 2027 సంక్రాంతికి తీసుకురాబోతున్నారు. ఇటీవల విడుదలైన ’మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీని షేక్ చేశారు. దీంతో ఆయన తర్వాతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి మూవీ టైటిల్ వినగానే అందరూ ముక్కున వేలేసుకుంటారని, ఒక విచిత్రమైన జర్నీని వెండితెరపై చూపించబో తున్నానని అనిల్ స్వయంగా ప్రకటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

అనిల్ రావిపూడి తన లక్కీ హీరో విక్టరీ వెంకటేశ్‌తో ఐదోసారి పని చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలు సంక్రాంతి బరిలో కాసుల వర్షం కురిపించాయి. ఈసారి కూడా అదే సెంటిమెంట్‌తో పూర్తిస్థాయి వినోదాత్మక కథతో సెట్స్‌పైకి వెళ్లడానికి స్క్రిప్ట్ పనులను వేగవంతం చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో వెంకటేశ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఒక డిఫరెంట్ మేనరిజంతో కూడిన పాత్రను డిజైన్ చేసినట్లు టాక్.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పూజా హెగ్దేని హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నారనే టాక్ వినవస్తోంది. పూజా హెగ్డే సినిమాల విషయాకొస్తే.. తమిళంలో దళపతి విజయ్ సరసన ఆమె నటించిన ‘జననాయగన్’ సినిమా సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇంకా పూజా మరికొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తోంది.