9 May, 2026 | 12:43 AM

కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మనే దుస్థితి

31-08-2024 03:55 AM

నిత్యం సచివాయలంలోనే సీఎం రేవంత్‌రెడ్డి

కేసీఆర్ కోరినా రేవంత్‌రెడ్డి సమయమిస్తరు 

రాష్ట్రంలో రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నయ్

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ‘సీఎం రేవంత్‌రెడ్డి తొమ్మిది నెలలుగా సచివాలయంలో అందుబాటులో ఉంటున్నారు. కేసీఆర్  తొమ్మిదన్న రేళ్లలో ఎప్పుడు సచివాలయంలో కూర్చోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా కలిసేవారు కాదు. రేవంత్‌రెడ్డి మాత్రం అపాయింట్‌మెంట్ అడిగిన ప్రతీ ఒక్కరికి సమయమిచ్చి వారి సమస్యలు వింటున్నారు. కేసీఆర్ కూడా అపాయింట్‌మెంట్ కోరినా సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ ఇస్తారు’ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

శుక్రవారం ఆయన ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే ప్రతిపక్ష నేతగా సీఎంను కేసీఆర్‌కు కలిసి సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా ప్రతిపక్ష నేత రావాలంటూ పిలిచే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం దురదృష్టకరమ న్నారు. రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీశ్‌రావుకు లేదని, ఇంకోసారి మాట్లాడితే తన భాష కూడా మారుతోందని హెచ్చరించారు.

తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చా రు? ఈ తొమ్మిది నెలల్లో సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారో? లెక్క  తేల్చుదామా? అని బీఆర్‌ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నారు. కేసీఆర్ ఇంట్లో కూర్చోని ప్రకటనలు చేయడం కాదని, ప్రజా క్షేత్రంలోకి వస్తాన్న విషయం మర్చిపోవద్దన్నారు. సీఎంగా ప్రజలతో కలవలేదు.. ప్రతిపక్ష నేతగా కూడా ప్రజల్లోకి వెళ్లడం లేదని, సభలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చెప్పిన మాటకు కట్టుబడి ఉండలేదన్నారు. 

సిద్దిపేటలోనే చర్చ పెడుదాం..

 రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 31 వేల కోట్లను మంజూరు చేసిందని, అందులో రూ. 18 వేల కోట్లను రైతు రుణమాఫీ కోసం ఖర్చు చేయగా, మరో రూ. 12 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ బ్యాంకులు, వ్యవసాయ శాఖ విధానాలు, ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా  కరాబ్ చేయడంతోనే రుణమాఫీకి ఆలస్యమ వుతోందని, ఈ విషయాన్ని రైతు లు గమనించాలని జగ్గారెడ్డి కోరారు.

రాహుల్‌గాంధీని కొడంగల్‌కు రావా లంటున్న హరీశ్‌రావు.. కొడంగల్ ఎందుకు? సిద్దిపేటలోనే చర్చ పెడుదామని, అక్కడికి కిసాన్ కాంగ్రెస్ నేతలు వస్తారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాం లో రైతు రుణమాఫీ విడతలవారీగా చేయడంతో అప్పు డు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసిందని, అందుకే అధికారంలోకి వచ్చాక ఒకే విడతలో రుణమాఫీ చేశామని తెలిపారు. రాహుల్‌గాంధీ వరంగల్ వస్తారని, రైతు రుణమాఫీపై అక్కడనే సంబురాలు ఉంటాయన్నారు.