calender_icon.png 16 December, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో విడత ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి పోలీసు శాఖ సిద్ధం

15-12-2025 12:25:55 AM

2025 ఫేజ్‌న  శాంతిభద్రతల నిర్వహణ కోసం బీఎన్‌ఎస్‌ఎస్ 163 ఉత్తర్వులు జారీ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య వెల్లడి

నిజామాబాద్ డిసెంబర్ 14 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని గ్రామ సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా  మూడో విడత ఎన్నికల జరగనున్నందున ప్రజా శాంతిని కాపాడటానికి, ఆర్మూర్ రెవెన్యూ మండలాల్లో (ఆర్మూర్, ఆలూర్, బాల్కొండ, భీంగల్, డొంకేశ్వర్, కమర్పల్లి, మెండోరా, మోర్తాడ్ , ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్లలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికిపైన తెలియజేసిన ప్రాంతాలో.   U/S 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని నిజామాబాద్ సిపి తెలిపారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 5 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకూడదని ఇందుమూలంగా ఏపీ ఆదేశించారు. 

సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలనీ ఆయన తెలిపారు. ఈ ఉత్తర్వులు ఈనెల 15-12-2025 ఉదయం 05:00 గంటల నుండి 18-12-2025 సాయంత్రం 05:00 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. పైన పేర్కొన్న ఆదేశాలను ఉల్లంఘించే ఏ వ్యక్తి  పై న అయినా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య హెచ్చరించారు.