calender_icon.png 16 December, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా రెండో విడత ఎన్నికలు

15-12-2025 12:27:07 AM

జిల్లాలోని 7మండలాల్లో 84 శాతం నమోదు 

నాగర్ కర్నూల్ డిసెంబర్ 14 ( విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా సాగింది. తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాగా బిజినపల్లి, నాగర్ కర్నూల్, తిమ్మాజిపేట, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లి మండలాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వాహంచారు.

ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు సమస్య ఆత్మక ప్రాంతాల పోలింగ్ కేంద్రాల వద్ద 2 ప్లస్ 4 పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామం లో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వారి సతీమణి సరితా రెడ్డి వారి కుమారులు పూర్తిగా బంధుమిత్రులంతా కలిసి ఆ గ్రామంలో ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మమ్మ కరుణాకర్ రెడ్డి గెలుపు కోసం ఉదయం నుంచి అక్కడే తిష్ట వేసి గెలుపు కోసం ఓటర్లను అభ్యర్థించారు. తీరా ప్రత్యర్థి నరసింహారెడ్డి పైన కేవలం 225 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలవడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సొంత గ్రామం నేరేళ్లపల్లిలోనూ కుటుం బ సభ్యులతో కలిసి ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. తాను బలపరిచిన అభ్యర్థి మీసాల పుష్ప గెలుపు కోసం కష్టపడాల్సిరావడం విశేషం.

బిజినపల్లి  మండలంలో  మొత్తం ఓటర్లు 61,419, మంది ఉండగా, 49,582, మంది 80.07 శాతం ఓటు నమోదు చేసుకున్నారు. నాగర్ కర్నూల్,  మండలంలో 34, 415, మంది ఉండగా, 29,282,  మంది 85.01, శాతం ఓటు నమోదు చేసుకున్నారు. తిమ్మాజిపేట, మం డలంలో  మొత్తం ఓటర్లు 30,091,  మంది ఉండగా, 26,253,  మంది 87.02, శాతం నమోదు చేసుకున్నారు. కొల్లాపూర్, మండలంలో  మొత్తం ఓటర్లు 28,926 ,మంది ఉండగా, 24,924,మంది 86.02, శాతం నమోదు అయింది.

పెంట్లవెల్లి, మండలంలో  మొత్తం ఓటర్లు 17,899,  మంది ఉండగా, 15,448 మంది. 86.03,  శాతం నమోదు అయింది. కోడేరు, మండలంలో  మొత్తం ఓటర్లు 29,284, మంది ఉండగా, 24,339, మంది  83.01,  శాతం నమోదు అయింది. పెద్దకొత్తపల్లి మండలంలో  మొత్తం ఓటర్లు 48,205, మంది ఉండగా, 40,323, మంది 83.06,  శాతం ఓటు నమోదయింది.

జిల్లాలో రెండవ విడత పోలింగ్ ప్రశాంతం

జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, డిసెంబర్ 14 ( విజయక్రాంతి ): వనపర్తి జిల్లాలో ఆదివారం జరిగిన రెండవ  విడత పోలింగ్ లో  వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత, మదనపూర్  మండలా ల్లో  పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.  పోలింగ్  ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరిగిన గ్రామ పంచాయతీ  ఎన్నికల పోలింగ్ తీరును కలెక్టరేట్లోని సమావేశం మందిరం నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, సాధారణ ఎన్నికల పరిశీలకులు మల్లయ్య భట్టు, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్‌తో కలిసి పర్యవేక్షించారు. 

 మధ్యాహ్నం 1.00 గంట వర కు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి  క్యూ లైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. పోలీస్ శాఖ ద్వారా కట్టుదిట్టమైన శాంతిభద్రతలు అమలు చేసినట్టు తెలిపారు.  రెండో విడతలో పోలింగ్ జరిగిన వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత మండలాల్లో మొత్తం కలిపి  1, 03, 406 ఓట్లు పోల్ కాగా, 87. 0% వోటింగ్ పర్సంటేజీ నమోదయింది. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.