25-07-2025 01:13:50 AM
ఉధృతంగా ప్రవహించే వాగులను దాటవద్దని ప్రజలకు ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన
ఆదిలాబాద్, జూలై ౨౪ (విజయక్రాంతి): రాష్ట్ర వాతావరణ శాఖ 3 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాం గం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం ఎస్పీ ప్రత్యేకంగా టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు అత్యవస ర సమయాలలో తప్ప బయటకి రాకూడదని సూచించారు. ఎటువంటి సమస్యలు ఉన్న అత్యవసర సమయంలో డయల్ 100 కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలన్నారు. నూతనంగా శిక్షణ తీసుకున్న డి.డి.ఆర్.ఎఫ్ బృందం జిల్లాలో 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడతారని తెలిపారు.
జిల్లా పోలీసు యంత్రాం గం అన్ని పోలీస్ స్టేషన్ లలో అప్రమత్తతతో ఉంటుందని వెల్లడించారు. భారీ వర్షాలు పడి వరదలు సంభవించినప్పుడు కల్వట్ల ను, బ్రిడ్జిలను, గమనిస్తూ ఉండాలన్నారు. బ్రిడ్జిలపై నుండి నీరు ప్రవహించే సమయాలలో ప్రజలు వాటిని దాట వద్దని సూచిం చారు.
ముఖ్యంగా యువకులు అత్యుత్సాహంతో ఉదృతంగా ప్రవహిస్తున్న జలపాతా లు, వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్ళవద్దన్నారు. జలాశయాలు, చెరువులు, వాగుల వద్ద మత్స్యకారులు, ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.
వర్షం భారీగా ఉన్నప్పుడు పొలాలలో రైతులు విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, విద్యుత్ స్తంభాలనుగాని, వైర్లను కానీ చేతులతో తాకవద్దనిసూచించారు. చెట్ల కింద, పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద వేచి ఉండరాదన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జలపాతాలు, చెరువులు, కుంట లు, వాగులు దగ్గర నీటి ప్రవాహం స్థితిగతులపై ముంద స్తు సమాచారం తెలుసుకొని ప్రత్యక్షంగా వెళ్లి పోలీస్ అధికారులు పర్యవేక్షించాలని తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల రాకపోకలను గమనించాలని సూచించారు.