25-07-2025 01:13:04 AM
5 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు అపహరణ
నిజామాబాద్, జూలై 24 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా రూరల్ పరిధిలో గల మోపాల్ మండలం కులాస్‌పూర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి ఏకంగా పదిళ్లలో చోరీలకు పాల్పడ్డారు. అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. పదిళ్లలో సుమారు 5 తులాల బంగారం, రూ.2 లక్షలకు పైగా నగదు చోరీకి గురైనట్లు సమాచారం.
పక్కన ఉన్న ఇళ్లకు బయటి నుంచి గడియ పెట్టి దుండగులు చోరీలు చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని విచారణ చేస్తున్నట్లు మోపాల్ సీఐ సురేష్ తెలిపారు.