25-07-2025 01:15:06 AM
ప్రధాని మోదీకి జాజుల శ్రీనివాస్‌గౌడ్ బహిరంగ లేఖ
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): భారత రాష్ట్రపతిగా తొలిసారి ఆదివాసి మహిళకు అవకాశం కల్పించినట్టుగానే జగ్‌దీప్ ధన్‌ఖర్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవిని బీసీ సాజాజికవర్గానికి చె ందిన బండారు దత్తాత్రేయ లేదా బీసీ మ హిళా కోట నుంచి తెలంగాణ మాజీ గవర్న ర్ తమిళిసైకి అవకాశమివ్వాలని ప్రధాని న రేంద్ర మోదీకి బీసీ సంక్షేమ సంఘం జా తీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వి జ్ఞప్తి చేశారు.
గురువారం ఆయన ఈ మేరకు ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముగ్గురు గవర్నర్లకు అవకాశం కల్పిస్తే అందులో అందరూ అ గ్రకులాలకు సంబంధించిన వారే ఉన్నారని, పార్టీ అధ్యక్ష పదవులు, ఇతర కీలకమైన పదవులు కూడా అగ్రకులాలకే ఇచ్చారన్నారు.
బీ సీ సామాజికవర్గానికి చెందిన జగదీప్ ధన్‌ఖర్ స్థానంలో బీసీకే అవకాశం ఇవ్వాలని శ్రీ నివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బీసీలకు పదవు లు ఇచ్చి బీజేపీ, కేంద్రం బీసీల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. గతంలో రా ష్ట్రపతులుగా, ఉప రాష్ట్రపతులుగా బీసీలకు అవకాశం రాలేదని.. అందువల్ల బీసీలకు తిరిగి ఉపరాష్ట్రపతిగా అవకాశమివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.