7 July, 2026 | 2:11 AM

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి

07-07-2026 12:00 AM

సరూర్ నగర్‌లో దివ్యాంగుల వేదన దీక్ష

ఎల్బీనగర్, జూలై 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని దివ్యాంగులు హెచ్చరించారు. సోమవారం సరూర్ నగర్ లోని హుడా కాంప్లెక్స్ ఎంట్రెన్స్ వద్ద సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో దివ్యాంగుల వేదన దీక్ష జరిగింది.

ఈ దీక్షకు పలువురు ప్రముఖులు హాజరై మద్దతు ప్రకటించారు. దివ్యాంగుల వేదన దీక్షలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమలు సాధన సమితి చైర్మన్ చెరుకు నాగభూషణం, మరుగుజ్జు వికలాంగుల సంఘం అధ్యక్షుడు రమేష్, మహిళా నాయకురాలు జయలక్ష్మి,, ధనలక్ష్మి, బాలలత, తదితరులు పాల్గొన్నారు. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, మన ఆలోచన సాధన సమితి అధ్యక్షుడు కటకం నర్సింగరావు, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాసం సత్యనారాయణ, బీసీ నేతలు బొమ్మ రఘురాం నేత, కాసెట్టి కుమార్, నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ తదితరు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వికలాంగులకు పింఛన్లూ రూ, 6వేలు పెంచుతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు పెంచలేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల చట్టం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా వికలాంగుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తుందని, ఇలాగే నిర్లక్ష్యం  వహిస్తే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు, తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి కేవీ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఏర్పుల బాలస్వామి, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్, హైదరాబాద్ రీజన్ ఇన్ చార్జి వరంగల్ రమేశ్, మల్కాజిగిరి మున్సిపల్ ఇన్‌చార్జి రాపాక వెంకట్, విద్యార్థి నా యకులు ప్రదీప్ పాశం, వంశీ పాల్గొన్నారు.