20-08-2025 12:00:00 AM
బూర్గంపాడు,ఆగస్టు19,(విజయక్రాంతి): ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటియు మండల కన్వీనర్ పాండవుల రామనాథం అన్నారు. మంగళవారం బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజరలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సమస్యలపై ధర్నా నిర్వహించారు. అనంతరం పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ లక్ష్మీ సాహితికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని ఆశాలకు ఆయన పిలుపు నిచ్చారు. ఆశాలకు నెలకు రూ 18 వేల పారితోషకం ఇవ్వాలని, వారికి పీఎఫ్, ఈఎస్‌ఐ, సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని, లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ తో భారీ ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశ వర్కర్స్ బుచ్చమ్మ, తారా దేవి, సుగుణ, తోకల రత్నకుమారి, బాయమ్మ, భారతి, నాగమణి, వెంకటరమణ, సీత, తిరుపత మ్మ.విజయ తదితరులు పాల్గొన్నారు.