calender_icon.png 20 August, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ కగార్ వ్యతిరేక సభను విజయవంతం చేయాలి

20-08-2025 12:00:00 AM

హుజురాబాద్,ఆగస్టు19:(విజయ క్రాంతి) వరంగల్లోఈనెల 24న వరంగల్ లోని అంబేడ్కర్ భవన్ లో నిర్వహించే ఆపరేషన్ కగార్ కు వ్యతిరేక సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌ రస్తాలో మంగళవారం కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ...

ఈ సభ ద్వారా ’ఆపరేషన్ కంగారూ’ను నిలిపివేయాలని, పోలీస్ క్యాంపులు ఎ త్తివేయాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. ఆదివాసీల హక్కులను కాపాడాలని అన్నారు.ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలుతున్నట్లు తెలిపారు. 1/70 చట్టాన్ని అమలు చేయాల ని,అటవీ హక్కుల పరిరక్షణ చట్టం, పెసా చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ దేశ సంపద అందరిదని, కేవలం కార్పొరేట్లదే కాదని పేర్కొన్నారు.మేధావులు, కార్మికులు, రై తులు, మహిళా, దళిత సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రముఖ న్యా యవాది ముక్కెర రాజు ,సొల్లు బాబు, ఆర్టీసీ నాయకులు మార్త రవీందర్, ఠాగూర్ సింగ్, ప్రభాకర్, న్యాయవాదులు తాళ్లపల్లి కుమారస్వామి, బండి రమేష్, భారత్ నాయకులు సత్తిరెడ్డి, సదా నందం, మహేందర్ రెడ్డి, తోపాటు తదితరులు పాల్గొన్నారు.