calender_icon.png 6 December, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి..

06-12-2025 08:12:50 PM

సిపిఐ పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్..

మణుగూరు (విజయక్రాంతి): ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని, సిపిఐ పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కోసం కార్మికులు డిపో ముందు చేపట్టిన రిలే దీక్షా శిబిరంను ఆయన శనివారం సందర్శించి, సిపిఐ పక్షాన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ, లాంగ్ డ్రైవ్లు, ఎక్స్ ట్రా డ్యూటీలు, నైట్ డ్యూటీలు చేసే డ్రైవర్లుకు రెస్ట్ రూమ్ లు లేకపోవటంతో పని ఒత్తిడికి గురవుతున్నారన్నారు. కేఎంపిఎల్ పేరుతో డ్రైవర్లను వేధించడం మానుకోవాలని, డిపోలో కార్మికులకు సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు రాయల భిక్షం, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.