ఎమ్మెల్యే చొరవతో వెంకటాపూర్‌లో 100 వీధిదీపాల ఏర్పాటు
హెచ్‌ఎండీఏ నిధులతో గ్రామంలో వెలుగులు
మొయినాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చొరవతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండిఏ నిధుల ద్వారా వెంకటాపూర్ గ్రామానికి 100 వీధి దీపాలు మంజూరు చేయడం జరిగింది.
ఈ వీధి దీపాలను గ్రామ సర్పంచ్ అర్చన అజయ్ రెడ్డి ఆధ్వర్యంలో, అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ అర్చన రెడ్డి మాట్లాడుతూ వీధి దీపాల ఏర్పాటు వల్ల రాత్రివేళల్లో భద్రత పెరగడంతో పాటు ప్రజలకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు.
ముఖ్యంగా చీకటి ప్రాంతాల్లో వెలుగులు రావడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎలుగుల ప్రభాకర్, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దవేటి విజయ్ రెడ్డి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.




