28-01-2026 12:00:00 AM
ప్రాన్, జనవరి 27.మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని డిసిసి బ్యాంకు వద్ద ఆల్ ఇండియా యునైటెడ్ ఫోరం బ్యాంక్ ఆఫ్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగస్తులు ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న తీరును మార్చుకోవాల్సిందిగా కోరారు.
ఇందులో ఐబీఏ సిఫార్సు చేసిన ఐదు రోజుల బ్యాంకింగ్ పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఐదు రోజుల పని దినాన్ని అమలు పరచడంలో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని వీడాలని వారు పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగస్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పని దినాలను తగ్గించి వారికి కావలసిన వస్తువులు ఏర్పాటు చేయాలని వారన్నారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ర్యాలీలు నిరసనలు నిర్వహిస్తామన్నారు.