calender_icon.png 28 January, 2026 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడ్ కూసింది.. పోరు మొదలైంది

28-01-2026 12:00:00 AM

  1. మోగిన బల్దియా ఎన్నికల నగారా
  2. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
  3. తక్షణమే అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్
  4. ఫిబ్రవరి 11 ఎన్నికలు...13న ఓట్ల లెక్కింపు
  5. నేటినుంచి నామినేషన్ల స్వీకరణ
  6. సిద్దిపేట మున్సిపల్‌కు ఎన్నికలు లేవు..

సంగారెడ్డి/సిద్దిపేట, జనవరి 27(విజయక్రాంతి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూ స్తున్న మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమలు జరుగుతుంది. ఈనెల 28 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నియమావళి అమలు చేయడానికి అధికారులు సంసిద్ధమవుతున్నారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఒక్క సిద్దిపేట మున్సిపాలిటీ మిన హా 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపా లిటీలు, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 28న నామినేషన్ల స్వీక రణ, 30న చివరి గడువు, 31న నామినేషన్ల స్క్రూటినీ, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ, ఫిబ్రవరి 11న ఎన్నికలు, ఫిబ్రవరి 12న అవసరమైన చోట రీ పోలింగ్, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలలోని 256 వార్డులకు, మెద క్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో 75 వా ర్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 

అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు

నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆశావహుల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే ప్రధా న పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను కొన్నిచోట్ల ప్రకటించారు. సం గారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు చైర్మన్ అభ్యర్థుల ను ఇప్పటికే జగ్గారెడ్డి ప్రకటించారు. అంతేగాకుండా జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు మెదక్ పార్లమెంట్ పరిధిలో మంత్రి వివేక్ ఇంచార్జిగా ఉన్నారు.

అలాగే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో మంత్రి అజారుద్దిన్ ఇంచార్జిగా ఉన్నారు. తమకే టికెట్టు ఖాయమని నమ్మినవారు ఇప్పటికే వార్డుల్లో ప్రచా రాన్ని మొదలుపెట్టారు. ఇక బీఆర్‌ఎస్ పార్టీ సైతం అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఇక బీజేపీ మాత్రం అభ్యర్థుల వేటలో పడింది. ఏదిఏమైనా ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడం తో మున్సిపాలిటీల్లో రాజకీయ, ఎన్నికల వేడి ప్రారంభమైందని చెప్పవచ్చు. 

సిద్దిపేట మినహా...

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల కోలాహలం మొదలైంది. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపాలిటీలు ఉండగా సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ముగియలేదు. దాంతో ఈ దశలో ఎన్నికలు జరగడం లేదు. గజ్వేల్ మున్సిపాలిటీలో 46739 ఓటర్లకుగాను మహిళలు 24 001, పురుషులు 22738, దుబ్బాక మున్సిపాలిటీలో 21341 ఓటర్లకుగాను మహిళలు 11117, పురుషులు 1022 4, చేర్యాలలో 137 77 ఓటర్లకుగాను, మహిళలు 7 119, పురుషులు 6658, హు స్నాబా ద్ లో 19227 ఓటర్లకుగాను, మహిళలు 9 878, పురుషులు 9348 చొప్పున ఓటర్లు ఉ న్నారు.

హుస్నాబాద్ ఎస్సీ జనరల్, చేర్యాల ఎస్సీ మహిళా, గజ్వేల్ బీసీ మహిళ, దుబ్బా క జనరల్ మహిళ కేటగిరిలో చైర్మన్ పదవులు రిజర్వేషన్ కేటాయించబడ్డాయి. దాం తో ఆశావాహులు పదవుల కోసం పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా లేని అభ్యర్థులు పక్క వార్డులో గెలిచేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.

గజ్వేల్ నియోజకవ ర్గానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మె ల్యే గా ప్రాతినిధ్యం వహించగా, కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ లో ఇప్పటివరకు బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచి న పొన్నం ప్రభాకర్ మంత్రిగా కొనసాగుతున్నారు. చేర్యాల మున్సిపాలిటీలో జనగామ డిసిసి జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇదే మున్సిపాలిటీలో నివాసం ఉంటా రు.

దుబ్బాకలో మూడు పార్టీలు బహబహుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ప్రస్తు తం బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి ముత్యంరెడ్డి కొడుకు నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. 

జిల్లాలో మూడు పార్టీల బలాబ లాలు చూసుకునేందుకు సిద్ధమయ్యారు. బిఆర్‌ఎస్ కంచుకోటను తిరిగి దక్కించుకుంటుందా లేక అధికారంలో ఉన్న కాంగ్రెస్ దక్కించుకుంటుందా, బిజెపి బోని కొడుతుందా అనే చర్చ జోరుగా సాగుతుంది.