06-01-2026 12:00:00 AM
నేడు లూయిస్ బ్రెయిలీ వర్ధంతి :
ప్రపంచంలోని అంధులకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాస్త్రీయ వాది, మేధావి.. లూయిస్ బ్రెయిలీ. లూయిస్ బ్రెయిలీ జనవరి 4, 1809లో ఫ్రాన్స్‌లోని రానక్రూవె గ్రామంలో మౌనిక్, సైమన్ దంపతుల కు జన్మించారు. లూయీస్ బ్రెయిలీ చాలా చురుకైనవాడు. మూడు సంవత్సరాల వయసున్నప్పుడే వాళ్ళ అన్న పుస్తకాలు చదివేవాడు. బెయిలీ లిపి పేరుతో ప్రింటింగ్, రైటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసిన ఫ్రెంచ్ ఉపాధ్యాయు డు బ్రెయిలీ. ఈ లిపిని అంధులు రాయడానికి, చదవడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు.
లూయిస్ బ్రెయిలీ తన మూడు సంవత్సరాల వయసులో తం డ్రి దుకాణంలో పనిముట్లతో ఆడుకుంటుండగా ఒక పనిముట్టు జారి అతని కుడి కంటికి తగలడంతో శాశ్వతంగా కంటిచూపును కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, బ్రెయిలీ తన అభిరుచిని వ దులుకోలేదు. తరువాతి కాలంలో ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నా రు. అందరిలాగా తమ కొడుకు చదువుకోవాలనే ఆశయంతో మౌనిక్ సైమన్ దంప తులు లూయీస్ బ్రెయిలీని.. అక్క అన్న తో పాటు పాఠశాలకు పంపించారు.
ఆ పాఠశాలలో బ్రెయిలీ కనబరిచిన అద్భుత ప్రతిభను గమనించిన తన తండ్రి చెక్కపై మేకుల అక్షరాల రూపంలో బిగించి వాటి ని తాకడం ద్వారా బ్రెయిలీకి అక్షర జ్ఞానానికి బీజం పడింది. ప్రపంచంలో మొద టగా 1784లో వాలంటీస్ హవే చేత ప్రారంభం అయిన అంధుల పాఠశాల లో పుస్తకాలు అన్నీ కాగితంపై మేకులతో ఉబ్బెత్తుగా చేసి అంధులు తడమడం ద్వారా గుర్తుపట్టేట్లు చేసి విద్యాబోధన చేసేవారు. దీనితో సంతృప్తి చెందని లూయీస్ 1821లో చార్లెస్ బార్బేరియన్ అనే సైన్యాధికారి రూపొందించిన రహస్య డీకోడ్ భాష ద్వారా సైనికులకు 12 చుక్కలతో మాత్రమే సందేశాలను నేర్పించే పాఠశాలలో చేరినప్పటికీ ఏదో తెలియని వెలితి.
ఈ నేపథ్యంలో 11 ఏళ్ల పరిశోధనల అనంతరం 1832లో అభివృద్ధి చెందిన సరళ పద్ధతిలో ఆరు చుక్కల లిపిని కనుగొన్నాడు. దీనికి బ్రెయిలీ లిపి అని పేరు పెట్టారు. లూయిస్ బ్రెయిలీ మేధాశక్తిని గ్రహించిన నేషనల్ స్కూల్ ఫర్ ది బ్లుండ్ స్కూల్ 1833లో ప్రొఫెసర్ పోస్టుకు ఎంపిక చేసింది. బ్రెయిలీ విద్యార్థులకు హిస్టరీ, ఆల్‌జిబ్రా, చరిత్ర పాఠ్యాంశాలు బోధించేవారు. అనంతరం బ్రెయిలీ 1839లో మరింత సులభంగా ఉండే డెకాపాయింట్ అనే కొత్త పద్ధతిని ఉపయోగించి పేపరుపై రంధ్రాలు సులభంగా చేసే పద్ధతిని కనిపెట్టి బ్రెయిలీ లిపిని మరింత అభివృద్ధి చేశారు.
అంతేకాదు లూయీస్ బ్రెయిలీ మంచి సంగీత విధ్వాంసుడు కూడా. 1834 నుంచి 1839 వరకు ఫ్రాన్స్ దేశంలోని ప్రముఖ చర్చీల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చేవారు. లూయీస్ బ్రెయిలీ కనిపెట్టిన బ్రెయిలీ లిపి ప్రస్తుతమున్న కంప్యూటర్ భాషకు వీలుగా రూపొందించబడడం చూస్తే ఆయన ముందు చూపు ఏంటనేది అర్థమవుతుంది. బ్రెయిలీ లిపి కనుగొన్న తర్వాత సమాచార రంగంలో అంధులకు విప్లవాత్మకమైన మార్పు వచ్చింది.
లూయీస్ బ్రెయిలీ మరణానంతరం ఆయన సేవలను గుర్తించిన ప్రపంచ దేశాలు ఆయన పేరు మీద పోస్టల్ స్టాంపులు, కరెన్సీ, విద్యా సంస్థలకు, పట్టణాలకు పేర్లను పెట్టుకోవడం జరిగింది. అయితే చిన్నతనంలోనే ట్యూబర్‌కులోసిస్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన లూయిస్ బ్రెయిలీ 1852 జనవరి 6న తన సొంత గ్రామంలోనే ప్రాణాలు విడిచారు. లూయిస్ భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన కనుగొన్న లిపి అంధుల జీవితాల్లో వెలుగు నింపుతూనే ఉంది.
కామిడి సతీష్