calender_icon.png 13 September, 2024 | 12:34 AM

పంచ్ అదిరింది

01-08-2024 02:19:42 AM

పారిస్: భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బుధవారం మహిళల 75 కేజీల విభాగం రౌండ్ 16లో లవ్లీనా 5 నార్వే బాక్సర్ సున్నివా హాఫ్‌స్టడ్‌ను చిత్తుగా ఓడించి పతకానికి అడుగు దూరం లో నిలిచింది. మ్యాచ్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించిన లవ్లీనా ప్రత్యర్థికి ఏమా త్రం అవకాశమివ్వకుండా పంచుల వర్షం కురిపించింది. అటాకింగ్ గేమ్‌తో లవ్లీనా తన ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా కోల్పోలేదు. దీంతో న్యాయ నిర్ణేతలు లవ్లీనా ఏకగ్రీ వంగా గెలిచినట్లు ప్రకటించారు.

టోక్యో ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో కాం స్యం గెలుచుకున్న లవ్లీనా ఈసారి పతకం రంగు మార్చాలనే లక్ష్యంతో ఉంది. అయితే ఆగస్టు 4న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో లవ్లీనాకు చైనా బాక్సర్ లి కుయాన్ రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురు కానుంది. చైనా బాక్సర్‌ను ఓడిస్తే మాత్రం లవ్లీనాకు పతకం ఖరారైనట్లే. ఇక 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి పవార్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. ఉత్కంఠంగా సాగిన తొలి రౌండ్‌లో ప్రీతి 2 తేడాతో కొలంబియా బాక్సర్ యేని మార్సిలా చేతిలో పరా జయం చవిచూసింది. నేడు తెలంగాణ బాక్స ర్ నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో ప్రిక్వార్టర్స్ మ్యాచ్ ఆడనుంది.