22-05-2025 12:47:13 AM
జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే21:ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు.బుధవారం మం డల పరిధిలోని అర్వపల్లి,రామన్నగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు రుతుపవనాల ప్ర భావం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలలో హమాలీల కొరత లే కుండా చూసుకోవాలని నిర్వాహకులు సూచించారు.లారీలను వెంటవెంటనే కొనుగోలు కేంద్రాలకు పంపిస్తున్నామని,రైతులు ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా కూడా మిల్లులకు తరలించవచ్చని, టన్నుకు రూ.300 చొప్పున ట్రాక్టర్కు కిరాయి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు.ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ తాహశీల్దార్ చిప్పలపల్లి యాదగిరి,ఆర్‌ఐ లు ఆర్ జలంధర్ రావు,పి వెంకట్ రెడ్డి,జూనియర్ అసిస్టెంట్ అశోక్,కేంద్రాల నిర్వాహకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.