02-08-2025 12:35:18 AM
కాంట్రాక్టర్ల ధనదాహానికి రోడ్లు పగుళ్లు
నాణ్యతపై దృష్టి సారించిన అధికారులు
ప్రజాధనం వృధాపై కన్నెర్ర చేస్తున్న ప్రజలు
అధికారుల పర్యవేక్షణ శూన్యం
మణుగూరు, ఆగస్టు 1( విజయ క్రాంతి) :అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల దాహం వెరసి ప్రజాధనం దొరివేనియోగానికి తెర లేపుతోంది. ప్రజా సౌకర్యార్థుల కో సం ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను అధికారులు, కాంట్రాక్టర్ల స్వార్థానికి దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలు మండిప డుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ని ధులతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణం అందుకు తార్కానంగా నిలుస్తోంది.
పినపాక ని యోజకవర్గం లోని గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. సగానికి పైగా సిసి రోడ్ల నిర్మాణం పనులు పూర్తి కాగా, మ రికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. .ఈజీఎస్ నిధుల తో వేస్తున్న సీసీ రోడ్లు ముణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. నెల రోజులై నా గడవక ముందే రోడ్లు నెర్రలుపాకి దర్శనమిస్తూ కంకర రాళ్లు తేలుతున్నాయి. మం డలాల్లో గల ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతట ఇదే పరిస్థితి నెలకొంది.
కొందరు కాంట్రాక్టర్లు రోడ్లు వేసి పెద్ద ఎత్తున లాభాలు గడించా లనే దురుద్దేశంతో, లాభార్జనే ధ్యేయం గా పనులు చేస్తున్నారని, పర్య వేక్షించాల్సిన అధికారులు నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చారని ఆరోపణలు వెలబడుతున్నాయి. నాణ్యతను పట్టించుకోకుండా కాంట్రాక్టర్ల కు అండదండలు అం దించడం శోచనీయమని వాపోతున్నారు.
సీసీ రోడ్లు.. పగుళ్లే పగుళ్లు..
మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శ్ నగర్ లో రూ 20 లక్షలతో వేసిన సీసీ రోడ్డు. పదికాలాల పాటు నాణ్యత గా ఉండాల్సింది పో యి.. మూణ్నాళ్లు గడవక ముందే పగుళ్లే పగుళ్లు అన్న చందంగా మారింది. పలుచోట్ల పగుళ్లు, రోడ్డుపై కంకర తేలింది. కాంట్రాక్టర్ల ధన దాహానికిలక్షలాది రూపాయల ప్రజా ధ నం వృథా అవుతున్నాయన డానికి ఇదే చక్కని ఉదాహరణ. ఈ ఒక్క రోడ్డే కాదు.. మున్సిపాలిటీ పరిధిలోని అనేక చోట్ల ఇ లాంటి దుస్థితే కనిపిస్తున్నది.
మూణ్నాళ్ల ముచ్చటగా రోడ్లు
నాణ్యత ప్రమాణాలను పట్టించు కోకుం డా హడావుడిగా ఆదర్శ నగర్ లో రోడ్డు ని ర్మాణంచేపట్టడంతో సీసీ రోడ్ వేసిన కొద్ది రోజుల కే ఎక్కడి కక్కడ పగుళ్లు తేలుతున్నా యి. వాస్తవంగా 1:3:6 నిష్పత్తిలో సిమెంట్, ఇసుక, కంక ర మిశ్రమంతో 15 సెంటీమీటర్ల ఎత్తు లో సీసీ రోడ్లు వేయాల్సి ఉండగా, గుత్తేదారులు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నార న్న ఆరోపణలు వస్తున్నాయి. ఫలి తంగా లక్ష ల రూపాయలతో నిర్మించిన రోడ్డు కాంట్రాక్టర్ ధనదాహానికి బీటవారుతున్నాయి.
ప్రజాధనం వృధాపై కన్నెర్ర
చేస్తున్న కాలనీ వాసులుకాంట్రాక్టర్లు నాణ్యతను పట్టించు కో కుండా హడావుడిగా పనులు చేసేసి చేతులు దులుపుకున్నార ని, అధికారులు పట్టించు కోలే దని ఆద ర్శ్ నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిసి రోడ్ నిర్మా ణం చేపట్టిన నెల కూడా గడవక ముందే పగుళ్లు ఏర్పడటం నాసిరకం పనులకు నిలువెత్తు నిదర్శనమని, ఇందుకు కారణం సి మెంట్ కన్నా డస్ట్ ఎక్కువగా ఉండటం తో రోడ్డు బీటలు పారడానికి కారణం అయిందనే విమర్శలు వినిపిస్తున్నా యి. పర్యవసానంగా ఆరోడ్డుఫై వాహనాలు ప్రయాణిస్తే కంకర తేలిదు మ్ములేస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. రోడ్ల నిర్మా ణంపై విజిలెన్స్ ఎంక్వయిరీకి డిమాండ్ చేస్తున్నారు.
కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకో వాలి : బీఆర్‌ఎస్ నాయకులు
నాణ్యత ప్రమాణాలను పాటించ కుండా, నాసిరకంగా రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌పై అధికారుల తక్షణమే చర్య లు తీసుకోవాలని బీఆర్‌ఎస్ యువజన నాయకులు పోశెట్టి రవికుమార్, తురక రా మకోటి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు సీసీ రోడ్ల నిర్మాణాల పై ప్రత్యేక దృ ష్టి సారించాలని, ప్రజాధనా న్ని సద్వినియో గం అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.