calender_icon.png 2 August, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారిపై గుంతలు పూడ్చండి : జమలయ్య

02-08-2025 12:37:57 AM

నేషనల్ హైవేడిఈకి ఫిర్యాదు

కొత్తగూడెం,ఆగస్టు 1, (విజయ క్రాంతి ):జాతీయ రహదారిపై నేలకొన్న గోతులను పూడ్చి రాకపోకలకు అంతరాయాలను తొలగించాలని సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో, శుక్రవారం  ఎన్ హెచ్, డి.ఈ. కార్యాలయంనందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య మాట్లాడుతూ, పాల్వంచ మండల పరిధిలోని రాంపురం నుండి పాల్వంచ, నాగారం వరకు జాతీయ రహదారిపై భారీ వర్షాల దృష్ట్యా, ఏర్పడిన గుంటలను పూడ్చాలని, రామవరం గోధుమ వాగు బ్రిడ్జిపై పై ఏర్పడిన గుంతలలో వర్షపు నీరు నిండి వాహనచోదకులకు ఎంతో ఇబ్బందిగా మారి పలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి అన్నారు.

తక్షణమే గోధుమ  పై ఉన్న గుంటలను పూడ్చాలని నేషనల్ హైవే అధికారులను డిమాండ్ చేశారు. హైవే అధికారులునామ మాత్రము ఇసుక, కంకర వేసి  మామ అనిపిస్తూ ప్రజలను మభ్యపెడుతూ,గుంటలు నింపుట వలన ప్రయోజనం లేదు. శాశ్వత పరిష్కారం చూపాలని ఆవేదన వ్యక్తo చేస్తున్నారు. వాహన దారులు ప్రాణాలను అరిచేతుల్లో ప్రాణం పెట్టుకుని, ప్రయాణించవలసిన అవసరం ఏర్పడుతుందన్నారు.

ఈ మధ్యకాలంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని, అనేక ప్రమాదాలు బారిన పడి కాళ్లు చేతులు విరిగి వికలాంగులుగా మారటం  బాధాకరమైన విషయం, వెంటనే  గోధుమ బ్రిడ్జిపై, మొర్రేడు  బ్రిడ్జిపై ఉన్న గుంటలను తక్షణమే పూడ్చి ప్రమాదాల నుండి ప్రజలను కాపాడవలసిన అవసరం నేషనల్ అధికారులపై ఎంతైనా ఉంది. జాతీయ రహదారి నిర్మాణం పనులు,

ఆపివేసిన  కాంట్రాక్టర్ పై తగులు చర్యలు తీసుకొని, రోడ్డుకి ఇరువైపులు ఉన్న డ్రైనేజీని  తక్షణమే పూర్తి చేయవలసిందిగా నేషనల్ అధికారులని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మునిగడప వెంకటేశ్వర్లు, నేరెళ్ల రమేష్, జిల్లా సమితి సభ్యులు భుఖ్య శ్రీని వాస్,వన్ టౌన్ ఏరియా సహాయ కార్యదర్శి కొల్లాపూర్ ధర్మరాజు, త్రీ టౌన్ ఏరియా సహాయ కార్యదర్శిలు విజయకుమార్ పోలోజు చారి, కూరపాటి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.