calender_icon.png 6 December, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయ సాధనే అసలైన నివాళి

06-12-2025 05:53:37 PM

అంతటి భాగ్యలక్ష్మి..

సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్చను సమానత్వాన్ని ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధనే నిజమైన నివాళి అని సంస్థాన్ నారాయణపూర్ బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి అంతటి భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం అంబేద్కర్ 70వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ఆయన చూపిన మార్గమే నేటికి మార్గదర్శకమన్నారు. చదువు వల్లనే సమాజంలో అంతరాలు తొలగిపోతాయని ప్రతిఒక్కరు అసమానతలు లేని సమాజంలో అభివృద్ధి చెందాలని కలలు గన్న దార్శనీకుడు అంబేద్కర్ అని కొనియాడారు.ఆయన ఆశయాలను సాధించడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.