06-12-2025 05:56:57 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే పిఓ, ఎపిఓలు తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శనివారం మామడ మండల కేంద్రంలోని రైతువేదికలో ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే పిఓ, ఎపిఓలకు శిక్షణ కార్యక్రమం కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పిఓల పాత్ర కీలకమని తెలిపారు.
మండలాలవారిగా పీఓలకు, ఎపిఓ లకు ఎన్నికల విధులపై శిక్షణ ఇస్తున్నామని వివరించారు. పిఓలు బాధ్యతాయుతంగా తమ విధులు పూర్తి చేయాలన్నారు. పీఓలకు ఎన్నికల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. అధికారులకు సమయపాలన, క్రమశిక్షణ అత్యంత కీలకమని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, డిపిఓ శ్రీనివాస్, డీఈఓ భోజన్న, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సుశీల్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.