21 April, 2026 | 2:30 AM

చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి

21-04-2026 01:25 AM

ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్ 

మొయినాబాద్ ఏప్రిల్ 20 (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ లోగల చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ 1300 మంది విద్యార్థులు చదువుతున్నారని వారిలో దాదాపు 560 మంది విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేసి వారి వద్ద నుంచి బ్యాక్ లక్స్ ఫీజు వసూలు చేయాలని కుట్ర పన్నుతున్నారని అన్నారు.

560 మంది విద్యార్థులను ఫెయిల్ చేసి 92 శాతం విద్యార్థులు పాసయ్యారని, కుటీల ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా పరిగనిస్తుందని అన్నారు. చేవెళ్లలో నడుస్తున్న ఎన్‌ఐఏటికి అనుమతి లేదు చేవెళ్ల ఎన్‌ఐఏటి విద్యార్థులను తమ చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ విద్యార్థులుగా చెప్పుకొని వారి వద్ద నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ.. వారి జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగా బ్యాక్ లాక్స్ పేరుతో పరీక్ష ఫీజులు దండుకోవాలని 560 మంది విద్యార్థులను ఫెయిల్ చేశారని అన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో యూజీసీకీ, (యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్) ఉన్నత విద్యాశాఖకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. చైతన్య  యూనివర్సిటీకి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు రివాల్యుయేషన్ సౌకర్యం కల్పించి వారు పరీక్ష రాసిన పేపర్లను విద్యార్థులకు చూపించాలని, ఎస్‌ఎఫ్‌ఐ సవాలు విసురుతోందని అన్నారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ ముందు నిరవధిక ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మొయినాబాద్ మండల కార్యదర్శి చరణ్ గౌడ్, ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల మండల కార్యదర్శి మాల చందు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.