21 April, 2026 | 2:44 AM

బాచుపల్లిలో చలివేంద్రాలు ఏర్పాటు

21-04-2026 01:24 AM

ప్రారంభించిన పీసీసీ జనరల్ సెక్రెటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా  

హైదరాబాద్, ఏప్రిల్ 20(విజయక్రాంతి): ఐవీఎఫ్ బాచుపల్లి డివిజన్, ఆర్యవైశ్య సంఘం బాచుపల్లి, వ్యా ల్యూమేడ్ హాస్పిటల్ వారి  భాగస్వామ్యంతో సమాజ సేవలో భాగంగా ఒకేసారి ఐదు చలివేంద్రాలను సోమవారం ఘనంగా ముఖ్య అతిథులతో ప్రారంభించారు.   వాల్యూమేడ్ హాస్పిటల్, బాచుపల్లి, మమత హాస్పిటల్ ఎదురుగా, బాచుపల్లి, కాసాని కబడ్డీ అకాడమీ ఎదురుగా, పూజిత ఎన్‌క్లేవ్ (కేకేఎం5), రాజీవ్ గాంధీ నగర్, వాల్యూమేడ్ హాస్పిటల్స్, ప్రగతి నగర్‌లలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఉప్పల శ్రీనివాస్ గుప్తా  మాట్లాడుతూ తీవ్రమైన వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఉచితంగా చల్లని తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఒకేసారి ఐదు చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం చేయడం ఎం తో గర్వకారణం అని అన్నారు.

ఐవీఎఫ్ బాచుపల్లి డివిజన్ అండ్ ఏవీఎస్ బాచుపల్లి వారు వాల్యూమెడ్ హాస్పిటల్ వారి సహకారంతో సంఘం సేవా దృక్పథం ప్రతిబింబిస్తూ, సమాజ హితం పట్ల ఉన్న నిబద్ధతను చాటుతోందన్నారు. సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్య క్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అదనంగా వెయ్యి మందికి చల్లటి మజ్జిగను కూడా పంపిణీ చేశారు.

కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్లు వీరేందర్ రెడ్డి, రవి కిరణ్, సుజాత, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రంగ రాయ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, వాల్యూమేడ్ హాస్పిటల్ అధినేత సతీష్, నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ గుప్తా, ప్రవీణ్ గుప్త, యూత్ అధ్యక్షులు కట్ట రవి, యూత్ ట్రెసరర్ కోల్పురి నరేష్ గుప్తా,ఐవీఎఫ్ గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షులు,బాచుపల్లి సంఘం అధ్యక్షులు వంగపల్లి నవీన్ కుమార్, ఐవీఎఫ్ బాచుపల్లి డివిజన్ సభ్యులు, జాయింట్ సెక్రెటరీలు విద్యాసాగర్, వినయ్, వైస్ ప్రెసిడెంట్ సురేష్, సభ్యులు కిరణ్, శ్రవణ్, మహిళా విభాగం సభ్యులు  పాల్గొన్నారు.