28 March, 2026 | 2:12 AM

తనివి తీరనిది శ్రీరామ నామస్మరణం

28-03-2026 12:11 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

హన్వాడ, మార్చి 27 : శ్రీరామ నామస్మరణం తనివి తీరనిదని  ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ నియోజకవర్గం,  హన్వాడ మండలంలోని లింగన్నపల్లి, వేపూర్, పెద్దదర్పల్లి, టంకర గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల దేవాలయాలను సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు, నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ  శ్రీరాముడు  సత్యం, ధర్మం, న్యాయం, కర్తవ్యబద్ధతకు ప్రతిరూపమని ఆయన తెలిపారు. తన తండ్రి వాక్యాన్ని నిలబెట్టుకోవడం కోసం రాజ్యాన్ని వదిలి వనవాసం వెళ్లడం, ప్రజల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యజించడం వంటి సంఘటనలు మహోన్నత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయన్నారు.

రామాయణం ప్రతి ఇంటిలో చదవబడే గ్రంథమని, అందులోని విలువలు మన జీవితాలను సన్మార్గంలో నడిపిస్తాయని పేర్కొన్నారు. శ్రీరామ నామస్మరణ ఎంతో శుభప్రదమై, మనస్సుకు ప్రశాంతతను అందిస్తుందని తెలిపారు. చెడుపై మంచి గెలుస్తుందనే సందేశాన్ని శ్రీరాముడు ప్రపంచానికి ఇచ్చాడని కొనియాడారు  ప్రతి వ్యక్తి తన జీవితంలో శ్రీరాముడి సద్గుణాలను ఆచరిస్తే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, న్యాయం నెలకొంటాయని, ధర్మమార్గంలో నడవడం ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

యువత ముఖ్యంగా శ్రీరాముడి జీవితచరిత్రను గ్రహించి, క్రమశిక్షణతో, బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. శ్రీ సీతారాముల వారి కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, వేముల కృష్ణయ్య, కార్యదర్శి టంకర కృష్ణయ్య,

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యాదిరెడ్డి,  సర్పంచులు శివాత్మిక శివకృష్ణ, శ్రీలక్ష్మి అచ్చెన్న యాదవ్, నాయకులు  రమేష్ యాదవ్, నర్సింహులు , దాసరి రఘు ,జాహంగీర్ యాదవ్, తిరుపతయ్య, బాబు , కతలయ్య, యాదయ్య, వెంకటేష్, తిరుమలయ్య, వార్ల యాదయ్య, సత్యయ్య, శ్రీరాం గౌడ్, యాదయ్య గౌడ్, నరేందర్ గౌడ్ , చంద్రశేఖర్, మారుతి, శిల్ప రవి తదితరులు పాల్గొన్నారు.