calender_icon.png 1 December, 2025 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల చైతన్యానికి ఫలితం!

27-11-2025 12:00:00 AM

మొత్తంగా బీసీలకు పెద్దపీట వేశామని, పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు లేని అభ్యర్థులకు కాంగ్రెస్ ట్యాగ్ తలిగించుకోవడం పెద్ద పని కాదు. గ్రామీణ జనం చాలా చైతన్యవంతమైన జనం.. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. 

తెలంగాణ రాష్ర్టంలో రాజకీయం రంకెలేస్తున్నది. ఎనిమిది నెలలుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల లొల్లి, దానిపై నెలకొన్న గందరగోళం తేలకముం దే 14 నెలలుగా  ఇంఛార్జిల పాలనతో అభివృద్ధికి నోచుకోక తల్లడిల్లుతున్న పంచా యతీల ఎన్నికలకు ఎట్టకేలకు సైరన్ మో గింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలో నిలిపి విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లకు కొత్త సారధులను నియమించడంలోనూ అదే పంథాను అనుసరిం చింది. తెలంగాణలోని 33 జిల్లాలతో పా టు, మూడు కార్పొరేషన్లకు సైతం అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.

ఇందులో భాగంగా డీసీసీ అధ్యక్షులుగా 17 మంది బీసీలను నియమించ డంతో ప్రతిపక్షాల గొంతులో వెలక్కాయ పడినట్లయింది. అసలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమితో ఖంగుతిన్న విపక్షాల స్పందన చూస్తే ఏదో అయోమయంలో పడుతున్నట్టుగా వాళ్ల వ్యవహారశైలి స్పష్టం గా కనిపి స్తున్నది. అందరూ ఊహించినట్టుగానే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాల్లో పారదర్శకత పాటించిన కాంగ్రెస్ బీ సీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అత్యధిక ప్రా ధాన్యం ఇచ్చింది.

డీసీసీ అధ్యక్షుల ఎంపికలో ఏఐసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్య టించి క్షేత్రస్థాయిలో తిరిగి అభిప్రాయసేకరణ చేసిన పిదప సామాజిక సమీకర ణాలు పాటించి, ముందు నుంచి చెప్పినట్టుగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా అమలు చేసి నిరూపించింది. ఇందులో ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం కల్పించడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి కులగణన చేపట్టి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు తీసుకొచ్చింది.

సంక్షేమ కార్యక్ర మాలను ప్రవేశపెట్టి నిర్విరామంగా అమ లు చేస్తున్నది. ప్రభుత్వ పరంగానే కా కుండా, సింహభాగం ఉన్న బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ పరంగా డీసీసీ అధ్యక్ష పదవులు కట్టబెట్టడం సా మాజిక వర్గానికి చెందిన సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు.  

ఆర్థికంగా ఎదిగినప్పుడే..

రిజర్వేషన్ల కొలిమిలో బీసీలు సమిధలను చేయడానికి ఒక వర్గం ఎప్పుడు అడ్డు పుల్లలు వేస్తుంది. ‘మేమెంతో.. మాకంతా’ అనే నినాదంతో పాలకపక్షంలో చేరేందు కు బీసీలకు ప్రజలందించిన అధికారం ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కాకుండా పాలకులు, వారి తాబేదార్లు అందలం ఎ క్కేందుకు ఉపయోగించుకోవడం వల్లే దే శానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలు రాజ్యాధికారా నికి దూరంగానే ఉంటున్నారు. సింహభాగంగా ఉన్న బీసీల్లో ఉండాల్సిన జాతి సం పద పిడికెడు మంది పెట్టుబడిదారుల చే తుల్లోకి వెళ్లిపోతుండడంతో సామాజిక వ ర్గం గిలగిలా కొట్టుకుంటున్నదనేది వాస్త వం.

మాన్యశ్రీ కాన్సీరాం చెప్పినట్లుగా కు లాలు ఆర్థికంగా ఎదిగినప్పుడే.. కుల ని ర్మూలన జరిగే అవకాశం ఉంటుందనే వి షయాన్ని అనేక సందర్భాల్లో పేర్కొన్న విష యం విదితమే. భారత రాజ్యాంగంలోని పీఠికలోనే సౌమ్యవాద లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో ప్రజలు జీవితాల్లో అం తరాలను తొలిగించి, అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా పంచడం ప్రజాస్వా మ్య ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కావాలనే సంకల్పంతో కాంగ్రెస్ ఒక్క అడుగు ముం దుకేసింది.

ఏ సమాజం సొంత కాళ్లపై నిలబడి ఉద్యమాన్ని రూపొందించుకుంటుం దో ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. మనువాద, పాలక పార్టీల ముందు చేతు లు చాచి అడుక్కునే విధానానికి స్వస్తి పలి కి రాజ్యాధికారం చేపట్టేందుకు రేవంత్ నాయకత్వంలో బీసీ సంఘాలు సమైక్యం గా ఉద్యమించాల్సిన అవసరముంది. రా జ్యాధికార సాధనతోనే బీసీల విముక్తి ఇ మిడి ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభు త్వం గ్రహించాలి.   

న్యాయపరమైన చిక్కులు!

ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే మహోన్నత న్యాయం అని అంటారు రోమన్ ఫిలాసఫర్ సిసిరో. ఈ మాటకు దగ్గరగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలుండడం హర్షించదగ్గ విషయం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేస్తూ సమాజంలోని బలహీనవర్గాల వారందరికీ ఆర్థిక స్వావలంబనవైపు మళ్లించడమే గొప్ప న్యాయంగా, అదే పాలకుడిగా తన కర్తవ్యంగా నిరంతరం భావిస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ మార్గదర్శకంలో తెలంగాణ ప్రభుత్వం కులగణ న సమర్థవంతంగా నిర్వహించింది.

అయ న సంకల్పం సంపద సృష్టించాలి, అది పేదవాళ్ల గుమ్మం తొక్కాలి అన్న రేవంత్ మాటలు గొప్ప దార్శనికతతో కూడుకున్నవి. అనాదిగా సమాజ సంపదకు మూల కారకులు ఉత్పత్తి కులాల వారే అని బ లం గా నమ్మిన కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని భుజాన ఎత్తుకొన్నది. రాష్ర్టంలోని బీసీ సమాజం ఇచ్చిన బంద్ పిలుపు కు అన్ని పార్టీలు మద్దతుగా నిలిచా యి.

కానీ నాయ్యపరమైన చిక్కులు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్ర భుత్వం తొమ్మిదొవ షెడ్యూల్‌లో చేర్చకుండా తిరస్కరించడం, ఆర్డినెన్స్ ఆమో దం తెలపకుండా అడ్డుకోవడం, ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 9ని అమలుకు నోచుకోకుండా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు వరుస పిటిషన్‌లు దాఖలు చేయడం.. నిరంతరం ఇటు బీసీలను, అటు ప్రభుత్వాన్ని వేధిస్తున్న సమస్యే అయినప్పటికీ, కేంద్రంతో పోరాడాల్సినంత పోరాడడం లో మాత్రం రేవంత్ సర్కార్ విఫలమైంద ని చెప్పొచ్చు.

ఏది ఏమైనా పల్లెలు అభి వృద్ధి కోసం రావాల్సిన మూడువేల కోట్ల నిధులు రాకుండా అడ్డుపడుతుందనే ఏకై క కారణంతో పంచాయతీ ఎన్నికలకు వెళ్లి కాడి దించిందనే అభియోగం నుంచి డీసీసీ అధ్యక్షులుగా సమతుల్యం పాటించి కొంత బొబ్బలు రాకుండా కాంగ్రెస్ తన ను తాను కాపాడుకుందన్నది ఇక్కడ గుర్తించాల్సి అంశం.

డేగ కళ్లతో ఎదురుచూపులు..

మొత్తంగా బీసీలకు పెద్దపీట వేశామని, పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు లేని అభ్యర్థులకు కాంగ్రెస్ ట్యాగ్ తలిగించుకోవడం పెద్ద పని కాదు. గ్రామీణ జనం చైతన్యవంతమైన జనం.. అందులో ఎలాంటి సందే హం అవసరం లేదు. కరువు కాటకాలులేని పంచాయతీల సర్పంచ్‌లుగా వ్యక్తిత్వం ఉన్న వారు గెలిచినా, కన్నీటి జాడలేని మంచికాలం కోసం అధికార పార్టీ చెంతన చేరడం గత 78 సంవత్సరాలుగా జరుగుతూనే వస్తున్నది.

అలాగని మొత్తం పంచా యతీల్లో పాగా వేశామని, కేంద్రంలోని బీ జేపీపై యుద్ధం చేయకుండా అన్ని స వ్యంగా ఉన్నాయని బీసీ సంఘాలను నిర్ల క్ష్యం చేస్తే అబాండాలు వేయడానికి వి పక్షాలు డేగ కళ్లతో ఎదురు చూస్తున్నాయి. రిజర్వేషన్ల అంశం సున్నితమైన అంశంగా మారింది. అలాగని ముట్టకుండా పాత పద్ధతుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పొతే గనుక బీసీ సమాజం కర్రుకాల్చి వా తపెట్టడం ఖాయం.

రైజింగ్ తెలంగాణ కో సం విరామం లేకుండా కృషి చేస్తున్న సీఎం రేవంత్ పార్లమెంట్ వేదికగా బీసీ రిజర్వేషన్లపై చర్చకు తెరలేపి, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి మోదీని నిలదీసే విధం గా కార్యాచరణ రూపొందిస్తే కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు శంకించేందుకు అవకాశం లేకుండా ఉంటుంది కదా! అప్పుడూ బీసీ వర్గాలకు దోస్త్ ఎవరో.. ద్రోహి ఎవరో తేలే అవకాశం ఉంటుంది.

జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో 42 శాతం పైగా బీసీలను అధ్యక్షులు గా నియమించి కామారెడ్డి డిక్లరేషన్‌కు క ట్టుబడి ఉన్నామని నిరూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ బీసీ నినాదంతో అండ గా నిలిచి పోరాడితేనే దేశంలో కాంగ్రెస్ బలపడుతుందనేది నిర్వివాదాంశం.