27-11-2025 12:00:00 AM
ఆమె ధీరవనిత. సాహసానికి మారుపేరు. ఎవరి పేరు చెబితే శత్రువుల గుండెల్లో గుబులు పుడుతుం దో, ఎవరి మాట వింటే రాజ్యాధినేతలు సైతం మోకరిల్లుతారో ఆమెనే కాకతీయ వీరవనిత రాణి రుద్రమదేవి దాదాపు 30 సంవత్సరాలు శత్రువులను తన రాజ్యం వైపు కన్నెత్తి చూడకుండా రాజ్యపాలన చేసిన అరుదైన పాలనా దక్షురాలిగా అసమాన పరాక్రమ శౌర్యశాలిగా పేరు గాం చింది.
రుద్రమదేవి తలుచుకుంటే చాలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 700 సంవత్సరాల పూర్వమే అద్భుత పరిపాల న చేసిన ఘన కీర్తి సంపాదించుకున్న తొలి తెలుగు మహిళా పాలకురాలు రాయగజకేసరి రాణీ రుద్రమదేవి. ఆంధ్రదేశ చరిత్ర లో కాకతీయుల పరిపాలన సుభిక్షంగా ప్ర జా సంక్షేమంగా పాలనందించిన రాజు గ ణపతి దేవుడు. పుత్ర సంతానం లేనందున రుద్రమదేవిని కుమారునిగా ఈ లోకానికి పరిచయం చేసి కొంతకాలానికి రుద్రమదేవికి పట్టాభిషేకం చేశాడు. ఆమె జన్మదిన సందర్భంగా పట్టాభిషేకానికి సంబంధించిన విశేషాలను ‘మందడం శాసనం’ తెలి యజేస్తుంది.
చిన్నతనం నుంచి పురుషుని లాగా పెంచి అస్త్ర, శస్త్ర విద్యలు, రాజనీతి విషయాలు నేర్పించారు. కొంతకాలానికి చాళుక్య వీరభద్రునితో వివాహం జరిగిం ది. రాజ్యపాలన బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజ్య బలోపేతానికి కృషి చేసింది. చుట్టూ ఉన్న శత్రు రాజులు స్త్రీ అనే చులకన భావంతో ఆ రాజ్యాన్ని హస్తగతం చే సుకోవడానికి దాడులు చేశారు. యాదవ రాజులు దాడులు చేయగా వారిని తరిమికొట్టి విజయం సాధించి ‘రాయగజకేసరి’ అని బిరుదు పొందింది రాణి రుద్రమ.
పరిపాలన దక్షత!
ఓరుగల్లు కోటలో రాణి రుద్రమదేవి అనేక కట్టడాలు కట్టించారు. ఆమె చెక్కించిన నల్ల రాతి శిల్పాలు, కీర్తి తోరణాలు వారి పాలనకు మకుటాయమానంగా ని లుస్తాయి. భవిష్యత్తులో మరే శత్రు రాజు లు దాడి చేయకుండా శత్రుదుర్వేద్యమైన కోటను సిద్ధం చేయించింది. అప్పటికే ఉ న్న పుట్టకోట, మట్టి కోట శత్రుదుర్గ్యమైన రాతికోట కాకతీయ సైనికులు మెట్ల ద్వారా ఎక్కి బయట నుంచి వచ్చే శత్రు సైనికులపై సరసలా కాగే నూనె ఆయుధాలతో దాడి చేసేలా నిర్మాణాలు చేశారు. కోటకు మధ్య లో నీటిలో మొసళ్లను పెంచే వారట.
రుద్రమదేవి మారువేషంలో రాజ్యమంతా తిరు గుతూ ప్రజల కష్టాలు తెలుసుకొని నిరంతరం ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీదనే దృష్టి పెట్టి రాజ్య ప్రజలను కన్నతల్లిలాగా పరిపాలించేది. ఇంట్లో సాధారణ గృహిణిగా, బయట మంచి పరిపాలకురాలిగా అంబా అని రుద్రమాంబ పిలిపించుకుం ది. రైతుల కష్టాలను శాశ్వతంగా తీర్చడానికి అనేక గ్రామాల్లో గొలుసుకట్టు చెరువు లను తవ్వించి వ్యవసాయం సమృద్ధిగా సాగేలా కరువు నివారణ చర్యలు చేపట్టి రాజ్యం పాడి పంటలతో తులతూగేలా సు భిక్షంగా పరిపాలించింది.
రుద్రమ తనను స్త్రీ అనే చులకన భావంతో చూసిన యాదవ రాజులు హరిహరిదేవుడు, ము రారి దేవుడు, ధర్మవర్ధనుడు వంటి సా మంతులను, శత్రువులను ఎదిరించి తన వీరత్వాన్ని చాటుకొని శత్రువుల పాలిట అపర కాళిక అయింది. తమకు సామంతులుగా ఉన్న కాయస్థ వంశానికి చెందిన అంబదేవుడు స్త్రీ అనే చులకన భావంతో దాడులు చేయడం ప్రారంభించాడు. సు మారు 80 సంవత్సరాల వయసులో యు ద్ధంలో లేదా యుద్ధ సన్నాహక సమయం లో కానీ శివైక్యం పొందినట్లు చందుపట్ల శాసనం ధ్రువీకరిస్తుంది.
చందుపట్ల శాసనం..
1289 నవంబర్ 27న రుద్రమదేవి రుద్రమదేవి, ఆమె సైన్యాధిపతి మల్లికార్జున నాయకుడు వీరమరణం పొందినం దుకు గాను పువ్వుల ముమ్మడి అనే బం టు చందుపట్ల సోమనాధ దేవాలయానికి కొంత భూమిని దానం చేసినట్లు ఈ శాసనం తెలియజేస్తుంది. అంతేకాకుండా కాకతీయులు తవ్వించిన రంగ సముద్రం వెనుక.. ‘నీర్నేల తోట, వృక్షఛాయ చేల మాగాణి అన్నింటిని ఆచంద్రార్కంగా ధారాపూర్వకంగా ఇస్తిమి’ అని శాసనంలో ఉంది.
దీనివల్ల నాటి సైనికులకు తమ రా ణి అంటే ఎంత భక్తి ఉండేదో తెలుస్తుంది. చందుపట్ల గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ రంగాచార్య ఈ శాస నం పరిష్కరించవలసిన అవసరం ఉన్నదని 1962లో భారతి పత్రికలో రాశారు . తర్వాత పి.వి పరబ్రహ్మ శాస్త్రి సందర్శించి దీనిని పరిష్కరించి రుద్రమదేవి మరణ శాసన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.
తర్వాత చరిత్ర పరిశోధకులు డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి, చరిత్ర పరిశోధకులు డి.సూర్య కుమార్ ఏకీభవించారు. చందుపట్ల శాసనం తిరుగులేనిదని నల్లమల ప్రాంతంలోని మెడమకల్ శాసనం చందుపట్ల శాసనాన్ని ధ్రువీకరిస్తుందని చరిత్ర పరిశోధకులు ధ్యావనవల్లి సత్యనారాయణ ఒక వ్యాసంలో పేర్కొన్నారు.
చాలా సంవత్సరాల వరకు గుడికి సంబంధించిన శిలగా సున్నం జాజు వేసి ఉండేది భూమిలో కూరుకుపోయిన శిలాశాసన ప్రాముఖ్యతను గ్రామానికి చెందిన వివేకానంద యువజన మండలి సభ్యులు, కోట గిరి దైవాదీనం అప్పటి కలెక్టర్ పురుషోత్తం రెడ్డికి వివరించగా 80 వేల రూపాయలు మంజూరు చేశారు. డి. సూర్య కుమార్ సహకారంతో ఈమని శివనాగిరెడ్డి శాసనాన్ని గద్దపై ప్రతిష్టించడం జరిగింది. ఈ శాసనాన్ని పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులు తంగెడ కిషన్ రావు ఎంఏ తెలు గులో పాఠ్యాంశంగా చేర్చారు.
మహిళలకు ఆదర్శం..
కాగా ఈ ప్రాంత చరిత్రను తెలుసుకుని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మిషన్ కాకతీయ పూడికతీత పనులను రంగ సముద్రంలో ప్రారంభించి అదనంగా రెండు కోట్ల రూపాయలు పూడికతీత పనులకు మంజూరు చేయడం జరిగింది. చందుపట్ల గ్రామంలో ప్రతి సం వత్సరం రుద్రమ దేవి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
దక్షిణ భారతదేశంలో కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమ దేవి దాదాపు 700 సంవత్సరాల క్రితమే అద్భుత పాలన అందించి వీరనారిని నేటి మహిళా సమాజం ఆదర్శంగా తీసుకోవా లి. తెలంగాణ వీర వనితగా కీర్తి పొందిన ఆమె వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించాలి. కాకతీయ ఉత్సవాలను రుద్రమ అమరత్వం పొంది న నేలలో నిర్వహించాలి. ఆ ప్రాంతాన్ని ప ర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఆ ప్రాంత ప్రజల ఆకాంక్ష.