calender_icon.png 9 July, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల కడుపు నింపుతున్న సన్నబియ్యం బువ్వ

09-07-2025 12:16:49 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య 

చేవెళ్ల, జులై 8: ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంతో పేదలు కడుపు నిండా అన్నం తింటున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య సంతోషం వ్యక్తంచేశారు. మంగళవారం చేవెళ్ల మున్సిపల్ పరి ధిలోని ఇబ్రహీంపల్లికి చెందిన లబ్ధిదారుడు జీవనోళ్ల కృష్ణ ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నిరుపేద ఇంట్లో సన్నబియ్యం భోజనం ఉండాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

ఈ కార్య క్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి , నేతలు జగన్ గౌడ్, షాన్ పాషాపాల్గొన్నారు.