09-07-2025 12:17:30 AM
ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ నిర్వాహకులు క్షమాపణ చెప్పాలి: కమ్మ గ్లోబల్ ఫెడరేషన్
ఖైరతాబాద్; జూలై 8 ( విజయ క్రాంతి) : కమ్మ సామాజికవర్గాన్ని కించపరిచేలా ’ఆలిండియా ర్యాంకర్స్’ వ్బుసైరీస్ ’ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని దీనిని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కెజిఎఫ్) తీవ్రంగా ఖండిస్తుంది అని ఫెడరేషన్ నేతలు ఐడుసుమల్లి శ్రీనివాసరావు, ముప్పా అంకమ్మ చౌదరి, కొత్తపల్లి శ్రీనివాసరావులు తెలిపారు.
వెంటనే ఆ సన్నివేశాలలో సిరీస్ నుంచి తొలగించి దర్శక, నిర్మాత, నిర్వాహకులు బహి రంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు . మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... మాదకద్ర వ్యాల నివారణకు కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సామాజికవర్గాల దాడిని కూడా సీరియస్ గా పరిగణించాలని కోరారు.
ఇక నుంచి కమ్మ సామాజికవర్గంపై ఎలాంటి దుష్ప్రచారం చేసినా పోలీస్ స్టేష న్లు, న్యాయస్థానాలను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ కమ్మ సంఘాల తెలంగాణ అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్రావు, మాజీ కార్పొరే టర్ మంచికలపూడి బానుప్రసాద్, సభ్యులు వి.సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.