చిన్నారిని బలిగొన్న ఆర్‌ఎంపీ?
మహబూబాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లికి చెందిన కొలిచల్మన్సూర్, మహేశ్వరి దంపతుల కుమార్తె మణిదీప(3) బుధవారం ఇంట్లో ఉన్న గోలీ లు, లేపనం (ఆయింట్‌మెంట్) తిన్నది. కు టుంబ సభ్యు లు మరిపెడలోని ఆర్‌ఎంపీ రవి వద్దకు తీసుకువెళ్లారు. అతను పాపకు చికిత్స చేసి ఇంటికి పంపాడు. రాత్రి 10 గం టలకు చిన్నారిని మళ్లీ ఇబ్బంది పడుతుండటంతో మళ్లీ రవి వద్దకు తీసుకెళ్లారు.
ఇంజక్ష న్ వేసి తిరిగి ఇంటికి పంపించాడు. తెల్లవారుజామున చిన్నా రి ఉలుకు పలుకు లేకుం డా పడుకోవడంతో మళ్లీ రవి దగ్గరకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం తీసుకెళ్లాలంటూ కారులో పంపించగా.. మధ్యలోనే మరణించింది. వచ్చిరాని వైద్యం చేసి చిన్నారి ప్రాణాలు బలిగొన్నాడని, ముం దుగానే చెపితే పెద్ద ఆసుపత్రికి వెళ్లేవారమని రవి క్లినిక్ వద్ద కుటుంబీకులు ఆందోళనకు దిగారు.






