calender_icon.png 8 August, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు సిట్ ముందుకు బండి సంజయ్

08-08-2025 12:00:00 AM

- ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా విచారణ

- బండి ఫోనే లక్ష్యంగా అత్యధిక సార్లు ట్యాపింగ్

- ట్యాపింగ్‌ను ధ్రువీకరించిన కేంద్ర నిఘా సంస్థలు

- బండి సంజయ్‌తో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారుల ప్రత్యేక భేటీ!

- ఫోన్ ట్యాపింగ్‌పై విచారణలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం సిట్ ముందుకు హాజరుకానున్నారు. ఫోన్ ట్యా పింగ్ వ్యవహారంలో సిట్ ఆయన్ను విచారించనుది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏకంగా ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్‌నే అత్యధిక సార్లు ట్యాపింగ్ చేసినట్టు పోలీస్ ఉన్నతాధికారులు నిర్ధారించారు.

ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక ఆధారాలను కేంద్ర నిఘావర్గాలు బండి సంజయ్‌కు అందజేయడంతో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. నేడు సిట్ ఎదుట విచారణకు హాజరుకాను న్న బండి, తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు సమర్పించనున్నారు. దీం తో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశంపై సర్వత్రా ఉత్కం ఠ నెలకొంది. తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ సిట్‌కు సమర్పించి, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటపెట్టాలని బండి సంజయ్ భావిస్తున్నారు.

ఒక కేంద్రమంత్రి ఫోన్‌నే ట్యాప్ చేయడం తీవ్రమైన అంశం కావడంతో బీజేపీ అధిష్ఠానం ఈ వ్యవహారంలో సీరియస్‌గా ఉంది. ఇందులో భాగంగా నే, కేంద్ర హోంశాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. వారు బండి సంజయ్ తో ప్రత్యేకంగా భేటీ అయి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కీలక అంశాలను చర్చించినట్టు తెలిసింది. సిట్ విచారణ లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. కాగా బండి సంజయ్ నేటి మధ్యాహ్నం 12:00 సిట్ అధికారుల విచారణకు హాజరవుతారు. విచారణ అనంతరం బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడి కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉంది.