21-08-2025 12:37:38 AM
- మొక్కుబడి తంతులాగా ప్రజాభిప్రాయ సేకరణ
- విస్తరణ ప్రాజెక్టు సరే.. భూ నిర్వాసితుల గోడును పట్టించుకొండి
- రాజకీయ ప్రజాసంఘాల నాయకుల డిమాండ్
-భూములిచ్చి ఏళ్లుగాసమస్యలతో బాధపడుతున్నాం
- న్యాయం చేయాలంటూ వేడుకున్న నిర్వాసిత ప్రజలు
- బోసి పోయిన సభాప్రాంగణం, ఖాళీగా కుర్చీల దర్శనం
- వేదిక వద్ద భారీ బందోబస్తు
మణుగూరు, ఆగస్టు 20 ( విజయక్రాంతి) :మణుగూరు ఓపెన్ కాస్ట్ గని విస్త రించేందుకుపట్టణం లోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ క్రీడా మైదానంలో బుధవారం చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్ర శాంతం గా పూర్తయింది. కాలుష్య నియత్రణ మండలి (పీసీబీ) ఆధ్వర్యంలో జిల్లా అదన పు కలెక్టర్ వేణుగోపాల్ అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.
సభలో మాట్లాడిన మెజారిటీ ప్రజలు, సం ఘాల ప్రతినిధులు, నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందించాలని, ప్రాజెక్టు నిర్మాణాన్ని స్వాగతించారు. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ తూతూమంత్రంగా సాగిందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఓసి విస్తరణ ప్ర భావిత నిర్వాసిత ప్రాంతాలైనా రామానుజవరం, తిర్లాపురం, మణుగూరు పంచాయ తీల ప్రజల అభిప్రాయాలు తీసుకోవడంలో పర్యావర ణ అధికారులు విఫలమ య్యారని గిరిజన, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు.
ఉదయం 10 గంటలకు కార్య క్ర మాన్ని మొదలుపెట్టిన అధికా రులు మధ్యా హ్నం 2 వరకు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సింగరేణి యూనియన్, ఉద్యోగులు, వివిధ పార్టీల, ప్రజాసంఘాల నాయ కుల అభిప్రాయాలు సేకరించారు. ఒక్కో యూనియన్, పార్టీల నాయకులతో మాట్లా డిం చారు. అక్కడికి వచ్చిన నిర్వాసిత, ప్రభావిత ప్రాంతాల ప్రజలు, యువత, రైతులు త మ గోడును వినిపించకుండానే వెను దిరగాల్సిన దుస్థితి నెలకొంది.
నిర్వాసితులకు న ష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తదితర అంశాలను కనీసం ప్రస్తావించ లేదు. మొద ట సింగరేణి జిఎం రామచందర్ ఓసి ప్రాజెక్ట్ పర్యా వరణప్రభావ(ఎ న్విరాన్ మెంట్ ఇం పాక్ట్) సర్వే నివేదికను, విస్తరించబోయే ప్రా జెక్టు వివరాలను వివరిం చారు. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంక టేశ్వర్లు మాట్లాడు తూ ఓసి కోసం ప్రజలు భూములను త్యా గం చేశారని, ప్రభావిత గ్రామాలను సింగరేణి దత్తత తీసుకోవాలని స్పష్టం చేశారు.
కొత్తప్రాజెక్టు వల్ల కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాల న్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు కేటాయించి,ప్రభావిత గ్రామాల అభివృద్ధి కోసం వినియోగించా లన్నారు. నిర్వాసిత గ్రామాల ప్రజలకు మెరుగైన నష్టపరిహారం అందజే యాలన్నారు. అనంతరం ప్రభావిత ప్రాంత ప్రజలు, స్వచ్ఛంద, ప్రజా సంఘాలు, పర్యావరణ కార్య కర్తలు అభిప్రాయాలను తెలిపారు.
సిపిఎం మండల కార్యదర్శి సాంబశివరావు మా ట్లాడుతూ నిర్వాసితప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయటం లో సింగరేణి అధికారులు విఫలం చెందారని ఆరో పించారు. బొగ్గు రవాణా చేస్తున్న లారీలు ని బంధనలు పాటించడం లేదని, అయినా అధికారులు పట్టించు కోవ డం లేదని వి మర్శిం చారు. తెలుగుదేశం పార్టీ నాయకు లు వట్టం నారా యణదొర మాట్లాడుతూ షెడ్యూ ల్డ్, పీసా చట్టాల ప్రకారం నిర్వాసిత ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు.
షె డ్యూల్ ఏరియాలోని చెరువును కుంట లకు పరిహారం అందజేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు కురం రవి మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ కారణంగా ఈ ప్రాంత ప్రజల సగటు జీవన ప్రమా ణాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గాలి, నీరు, ధ్వని కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోందని, విపరీతమైన కాలుష్యం కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు.అధికారులు ప్రజల బాధలు పట్టించు కోవడంలే దని విమర్శించారు.
రామానుజ వరం మా జీ సర్పంచ్‌బాడిస సతీష్ మాట్లాడుతూ సిం గరేణి ప్రభావిత గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్నారు. కార్మిక సంఘాల నాయకులు రాం గోపాల్, నాజర్ పాషా, మిడిదొడ్ల నాగేశ్వరరావు ఓసి విస్తరణ ను స్వాగతించారు. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా తమకు అనకూలం గా ఉన్న వారి ని మాత్రమే వేదిక పైకి పిలిచి వారి అభిప్రాయా లను సేకరించి పర్యావరణ ప్రజాభి ప్రాయసేకరణ కార్యక్ర మాన్ని తూ తూ మం త్రం గా ముగించారని పలువురు ఆరోపించారు.
సింగరేణికి భూములు ఇచ్చి నేడు భిక్ష మెత్తుకోవాల్సినదుస్థితి ఏర్పడిం దని నిర్వాసితులు మండిపడ్డా రు. దుమ్ము దూలి, పొగ తో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేయగా, వాయు, జల కాలుష్యం ఏ ర్పడి సమీపంలో ఉన్న పంట పొలాలు కలుషితమై పంటలు పండ వని రైతులు వాపోయారు. సభలో మాట్లాడే అవకాశం రానివారు అధికారుల కు వినతి పత్రాలు అంద జేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓసి ప్రాజె క్టుకు సంబంధించి ప్రజలు, నాయకు లు, ప్రతినిధుల అభిప్రాయాల ను నమోదు చేశామని, నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ఈ సభలో పొల్యూషన్ కం ట్రోల్ బోర్డు ఈఈ రవీందర్, భూ సేకరణ స్పెషల్ కలెక్టర్ సుమ, తాహసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీ వో శ్రీనివాసరావు, సింగరేణి జిఎం రామచందర్, సింగరేణి అధికారు లు పాల్గొనగా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి , సీఐ పాటి నాగబాబు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.