22 July, 2026 | 2:14 AM

ఓటర్ నమోదు ప్రక్రియలో బీఎల్‌ఏ, సూపర్వైజర్ల పాత్ర కీలకం

22-07-2026 01:06 AM

చేగుంట జూలై 21ఓటర్ నమోదు ప్రక్రియలో బిఎల్‌ఎ, సూపర్వైజర్ల పాత్ర కీలకమని దుబ్బాక నియోజకవర్గ సర్ ప్రక్రియ నియోజకవర్గ ఇన్చార్జి, టీపిసిసి జనరల్ సెక్రటరీ శంబూల శ్రీకాంత్ గౌడ్, దుబ్బాక కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం చేగుంట గ్రామ పంచాయతీ   కార్యాలయంలో చేగుంట మండల అధ్యక్షులు, బి ఎల్ ఏ లు, సూపర్వైజర్లు సర్పంచులు మాజీ సర్పంచులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఓట్లను తీసివేత ప్రక్రియకు పూనుకొందని, మాయ మాటలతో మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో ఓటర్ నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బిఎల్‌ఎలు సూపర్వైజర్లు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. . కాంగ్రెస్ పార్టీ నియమించిన బియల్‌ఏలు, సూపర్వైజర్లు, ఓటర్ నమోదు పక్రియలు అంకితభావంతో పనిచేసే మంచి గుర్తింపుకు తేవాలని అన్నారు. మండలం లొ బిఎల్‌ఎలు మంచిగా పనిచేస్తున్నట్లు, మంచిగా పని చేసినట్లయితే, వీరిని రాహుల్ గాంధీ,ముఖ్యమంత్రితో కల్పించి ఫోటో తీసుకునేటట్టు ఏర్పాటు చేయుటకు కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, మార్కెట్ కమిటీ కమిటీ చైర్మన్ వెంగళ్ రావు,మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, దుబ్బాక నియోజకవర్గ      బిఎల్‌ఏ కో ఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కోండి శ్రీనివాస్,మార్కెట్ కమిటీ డైరెక్టర్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, పట్టణ ఉపసర్పంచ్ రఫీ, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్, మండల సినియర్ నాయకులు, కార్యకర్తలు  తదితర నాయకులు పాల్గొన్నారు.