ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
గజ్వేల్, జులై 21: గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఏడు అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనితా అబ్రహం తెలిపారు. (బీబీఏ)1, బయోటెక్నాలజీ1, కామర్స్1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్2, హెల్త్ కేర్ మేనేజ్మెంట్1, జువాలజీ1 చొప్పున మొత్తం ఏడు పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
సంబంధిత సబ్జెక్టులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో, బీసీ, ఓసీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని, ఆసక్తి గల అభ్యర్థులు జులై 23లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెట్, సెట్ అర్హతలు లేదా పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
అర్హులైన అభ్యర్థులకు జులై 25 ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ, డెమో క్లాస్ ఆధారంగా ఎంపిక నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ అసలు ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ ప్రతులను తీసుకుని హాజరు కావాలని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనితా అబ్రహం సూచించారు.






