16-11-2025 10:21:37 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అందుగులపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని మూడవ జోన్ లో నివాసముండే సింగరేణి ఉద్యోగి తోట సతీష్ కుమార్(59) తన పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై మంచిర్యాలకు వెళుతుండగా వెనకాల వచ్చిన గుర్తుతెలియని కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం నడుపు తున్న సతీష్ కింద పడగా తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కేకే 5 గనిలో జనరల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.