calender_icon.png 17 November, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల న్యాయ సాధన దీక్ష

16-11-2025 10:28:05 PM

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీల న్యాయసాధన దీక్ష ఆదివారం చేపట్టారు. కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తాలో కానిస్టేబుల్ క్రిష్టయ్య ప్రాంగణంలో బీసీల న్యాయ సాధన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ ప్రతినిధులు చింతల శంకర్ నేత మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు న్యాయబద్ధమైనవని అసలైతే బీసీలకు జనాభా ప్రతిపాదికన 60 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని కానీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42 శాతానికి కట్టుబడి ఉండి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులను హెచ్చరించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్ బీసీ జేఏసీ కి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బీసీ జేఏసీ నాయకులు చింతల శంకర్ నేత, సాప శివరాములు, నీల నాగరాజు, మల్లన్న, సూర్య మల్లేష్, చాకలి రాజయ్య, తుమ్మ మచ్చేందర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజేందర్, రాజీవ్, శ్రావణ్ కుమార్ గౌడ్, మంజుల, భాజా లలిత, మహేష్, అప్రోజ్, షీలా సాగర్, ఇర్ఫాన్, యువకులు తదితరులు పాల్గొన్నారు.