calender_icon.png 17 November, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌడ కులస్తులు రాజకీయంగా ఎదగాలి

16-11-2025 10:33:05 PM

గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్..

హన్మకొండ (విజయక్రాంతి): గోపా వరంగల్, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు డా.బైరి లక్ష్మీనారాయణ గౌడ్, డా. చిర్ర రాజు గౌడ్ ల అధ్యక్షతన గోపా 23వ కార్తీకమాస వనభోజనాల కార్యక్రమం చిల్డ్రన్స్ పార్క్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగామ ఆర్డీవో జీవి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గౌడ కులస్తులు రాజకీయంగా ఎదిగే విధంగా ప్రతి ఒక్క గోపా నాయకులు గౌడ్ లకు పెద్దన్న పాత్ర పోషించాలని, గౌడ కులస్తుల మూల పురుషుడు కౌండిన్య ముని కార్తీక పౌర్ణమి నాడు జన్మించడం కారణంగా ఈ మాసంలోనే గౌడ కులస్తుల ఆరాధ్య దేవుళ్ళు అయినా కంఠమహేశ్వరస్వామి, సురమాంబ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లికి పూజ కార్యక్రమాలు చేసి కార్తీకమాస వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం వచ్చిన విశిష్ట అతిది బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్ మాట్లాడుతూ..గౌడ కులస్తుల  చైతన్యవంతమైనటువంటి జాతి అని, మన కులంలో పుట్టిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు డాక్టర్ తాళ్లపల్లి  రవి గౌడ్, కార్పొరేటర్ పోశాల పద్మ గౌడ్, గోపా మాజీ అధ్యక్షులు బూర విద్యాసాగర్ గౌడ్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోనగాని యాదిగిరి గౌడ్, సీఐ రామకృష్ణ గౌడ్, మార్క విజయ్ గౌడ్, గోపా రాష్ట్ర నాయకులు ముంజ వెంకట్రాజ్యం గౌడ్, కోల రాజేష్ గౌడ్, గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ గౌడ్, గునిగంటి రమేష్ గౌడ్, పోషాల సురేందర్ గౌడ్, తాళ్లపెళ్లి ప్రకాష్ గౌడ్ తదితరులు, గోపా సభ్యులు పాల్గొన్నారు.