calender_icon.png 17 November, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై కేసు నమోదు చేయాలి

16-11-2025 10:38:11 PM

మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి షేక్ హైమద్

చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలంలోని రుక్మాపూర్ లో నకిలీ విత్తనాలతో పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను మానవ హక్కుల వేదిక నేతలు షేక్ అహ్మద్, దిలీప్ రోహిత్, సిరిల బృందం పంట పొలాలను పరిశీలించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న కంపెనీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి షేక్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షేక్ అహ్మద్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో విత్తన కంపెనీలు ఒక మాఫియాగా మారి రైతులను బాహాటంగా మోసం చేస్తున్న ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.

మేల్, ఫీమేల్ వరి విత్తనాలు ఉచితంగా సరఫరా చేసి రైతులను కొన్ని కంపెనీలు మోసం చేస్తున్నాయన్నారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న కంపెనీలపై ఇప్పటికైనా కేసులు నమోదు చేసి పంట నష్టపోయినరైతులకు ఎకరాకు రూ. 80 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మేకల పరమేష్, పంట నష్టపోయిన రైతులు శ్రీనివాస్, మోహన్ లక్ష్మి, శివయ్య, తదితరులు ఉన్నారు.