calender_icon.png 17 November, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో మెడికవర్ ఉచిత గుండె వైద్య శిబిరానికి స్పందన..

16-11-2025 10:30:38 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని జెఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత గుండె వైద్య‌ శిబిరంకు స్పందన లభించింది, ఈ ఉచిత వైద్య శిబిరంలో 100 మందికి పైగా మెడిక‌వ‌ర్ ఆసుపత్రి కార్డియాల‌జిస్టు డాక్టర్ అనీష్ ప‌బ్బ‌ వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు చేపట్టి రోగనిర్దారణ చేపట్టారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మెడికవర్ ఆసుపత్రిలో పండుగలు, సెలవులతో సంబంధం లేకుండా 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ శిబిరంలో పెద్ద‌ప‌ల్లి జిల్లా గ్రంధాల‌య సంస్థ చైర్మ‌న్ అంత‌టి అన్న‌య్య‌గౌడ్‌, జేఎస్ఆర్ హాస్పిటల్ అడ్మిన్ అయిల ర‌మేశ్‌, సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి భాస్కర్, పెగడ చందు, రిటైర్డ్ హెచ్ ఎం, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, నాయకులు పెగడ ప‌ర్శ‌రాములు, రాజేంద‌ర్‌, ర‌మ‌ణ‌, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, ర‌మేశ్ తదితరులు పాల్గొన్నారు.