13 April, 2026 | 1:00 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం

07-10-2025 12:00 AM

కలెక్టర్ దివాకర టిఎస్

ములుగు, అక్టోబరు6 (విజయక్రాంతి): ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావుతో కలసి ఎంపీటీసీ,జెడ్పిటిసి ఎన్నికల నిర్వహణ కొరకు రిటర్నింగ్,సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా కార్యదీక్షతో విధులు నిర్వర్తించాలని తెలిపారు.

ప్రతి విషయంలో అత్యంత జాగ్రత్త పాటించాలన్నారు.ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి రిటర్నింగ్ అధికారులు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి మండలంలో మూడు లేదా నాలుగు ఎంపీటీసీలకు ఒక రిటర్నింగ్ అధికారినీ,ప్రతి జెడ్పిటిసికు రిటర్నింగ్ అధికారిని నియమించామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకత్వాలు రిటర్నింగ్ అధికారులు హ్యాండ్ బుక్ లో సవివరంగా ఉన్నాయని, వాటిని క్షుణ్నంగా అవగాహన చేసుకొని దానికనుగుణంగా విధులు నిర్వర్తించాలని అన్నారు.

రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణ నియమావళి ప్రకారం ఎన్నికల నోటీసు ఇవ్వాలని, నామినేషన్ల పేపర్ల స్వీకరణ, రిటర్నింగ్ అధికారి కార్యాల యం నోటీసు బోర్డుపై స్వీకరించిన అభ్యర్థుల నేషన్ పత్రాల జాబితా,స్వీయ ప్రకటన ప్రతులను ప్రచురించాలని,నామినేషన్ పత్రాల పరిశీలన,ఏదేని నామినేషన్ పత్రాన్ని తిరస్కరించినచో దానికి గల కారణం తెలపాలని నామినేషన్ పత్రాల జాబితా ప్రచురించాలని,అభ్యర్థుల ఉపసంహరణ నోటీసు స్వీకరించాలని,పోటీ చేయు జాబితా,గుర్తులు కేటాయింపు పోస్టల్ బ్యాలెట్ పేపర్ పోలింగ్ కేంద్రాలు ఉపయోగించే బ్యాలెట్ పేపర్ ముద్రణ,ప్రతిరోజు  పర్యవేక్షించాలని,ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడినప్పటి నుండి ఫలితాలు ప్రకటించేవరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని అన్నారు. ఏరోజుకారోజు టీ పోల్ సాఫ్ట్వేర్ లో ఆర్‌ఓలు నివేదికలను ఎలక్షన్ ప్రాసెస్ మాడల్ ను ఉంచాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా,రిటర్నింగ్,సహాయ రిటర్నింగ్ అధికారులు,మాస్టర్ ట్రైనర్లు,తదితరులు పాల్గొన్నారు.