calender_icon.png 7 October, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఉద్యమాలకే ప్రాణం పోసిన సీతారామయ్య పాత్ర మరువలేనిది

07-10-2025 08:07:14 PM

గెరిల్లా పోరాటమే ఆయన జీవిత లక్ష్యం

గరిడేపల్లి (విజయక్రాంతి): కమ్యూనిస్టు ప్రజా ఉద్యమాల్లో మెదరమెట్ల సీతారామయ్య చెరగని ముద్ర వేశారని, ఉద్యమాలకే ప్రాణం పోసిన ఆయన పాత్ర మరువలేనిదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు అన్నారు. మండలంలోని వెలిదండ గ్రామంలో స్వర్గీయ మేదరమెట్ల సీతారామయ్య 28వ వర్ధంతి సభలో ఆయన మంగళవారం పాల్గొని మాట్లాడారు. మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన సీతారామయ్య ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణలో పీడిత ప్రజల విముక్తికై కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన ప్రజా సాహిద పోరాటంలో సీతారామయ్య కీలక పాత్ర పోషించాలని తెలిపారు. విప్లవం కోసం ప్రాణాలను త్రుణప్రాయంగా భావించి ప్రజల కోసం పనిచేసే లక్ష్యంతో ఆయన పని చేశారని గుర్తు చేశారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో సీతారామయ్య గేరిల్ల పోరాటాన్ని ఎంచుకున్నారని ఆ పోరాటంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లి అనంతరం కొంతకాలం రహస్య జీవితాన్ని గడిపారని తెలిపారు. పాత మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో సిపిఎం పార్టీ నిర్మాణంలో కీలక భూమిక పోషించారని, ఏ గ్రామంలో సమస్య వచ్చిన ఆయనే పరిష్కరించే వారిని తెలిపారు. సీతారామయ్య జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రజల మధ్య మత ఘర్షణలకు అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.దేశం విచ్ఛిన్న కోసం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల పేరుతో ప్రచారం సాగిస్తుందని తెలిపారు.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ బలమైన స్థానాల్లో పోటీ చేయాలని దిశా నిర్దేశం చేశారు. అనంతరం మేదరమెట్ల సీతారామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం మండల కార్యదర్శి షేక్ యాకుబ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, ఒట్టేపు సైదులు, నరసింహారావు, హుజూర్నగర్ మండల కార్యదర్శి పోషబోయిన హుస్సేన్, సిపిఎం మండల కమిటీ సభ్యులు యానాల సోమయ్య, తుమ్మల సైదయ్య, దోసపాటి బిక్షం, షేక్ వలి, పఠాన్ మై బెల్లీ, బిక్షం, శ్రీను, శేఖర్, సుశీల, విద్యావేత్త పోటురామారావు, వెలుగూరి బంగారయ్య, యానాల బిక్షమయ్య, ములకలపల్లి కాశయ్య, కమల, కిరణ్, గోపి, రాంబాబు, రామారావు, దేవాణిక్యం, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.