calender_icon.png 7 October, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో నీట మునుగుతున్న పంట పొలాలు

07-10-2025 08:03:39 PM

మంజీరా నది పరివాహక ప్రాంతంలో నదిలో పేరుకుపోయిన ముళ్ళ చెట్లు మట్టి కుప్పలు

నియోజకవర్గంలో తెగిపోయిన చెరువు కట్టలు పోచారం ప్రాజెక్టు అభివృద్ధి కోసం

నది పరివాహకమంతా శుభ్రపరచుటకు నిధులు మంజూరు చేయమని నీటిపారుదల శాఖ మంత్రికి వినతి

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): హైదరాబాదులోని డా. బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఆధ్వర్యంలో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల పురోగతి, ఇటీవల భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పోచారం ప్రాజెక్ట్ బలోపేతం, సిల్ట్ తొలగింపు చర్యలు, అలాగే ప్రాజెక్ట్ ప్రవాహం క్రింద ఉన్న అడవిలాగా మరీనా చెట్ల తొలగింపు, వంటి అంశాలపై మంత్రితో ఎమ్మెల్యే మదన్మోహన్ సమగ్రంగా చర్చ నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, వెంటనే మరమ్మతులు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. 

నిజాంసాగర్ ప్రాజెక్టు ఎక్కువాన ఉన్న మంజీరా నది పరివాహక ప్రాంతంలో నదిలో గుంపులు గుంపులుగా చెట్లు పొదలు పెరిగి ఇసుకమేటలు మట్టిదిబ్బలు పెట్టి నీటిని వెనుకకు నెట్టుతూ రైతుల పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని, వెంటనే నదిలో ఉన్న ఇసుకదిబ్బలను గుంపు చెట్లను తొలగించడానికి చర్యలు చేపట్టాలని మంత్రిని ఎమ్మెల్యే మదన్మోహన్ కోరారు. ఎమ్మెల్యే మదన్మోహన్ వినతి మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మైనర్ ఇరిగేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదుల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఈ&సి, చీఫ్ ఇంజినీర్లు, సంబంధిత అధికారులు జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంత రావు తదితరులు పాల్గొన్నారు.