యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలన్నదే అంబేద్కర్ లక్ష్యం
ఘట్ కేసర్, జూలై 12 (విజయక్రాంతి): కులం, మతం లేదా ఆర్థిక స్థితి కారణంగా ఎవరూ వెనుకబడకూడదని, సామాజిక న్యాయమే దేశ అభివృద్ధికి పునాదిగా ఉండాలని, యువత విద్యతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రోత్సహించారని ఘట్ కేసర్ యాదవ సంఘం అధ్యక్షులు మామిండ్ల మల్లేష్ యాదవ్ అన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు 274వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘట్కేసర్ పట్టణంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఘట్కేసర్ యాదవ్ సంగం అధ్యక్షులు మామిండ్ల మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులు లంబ పవన్ యాదవ్, కార్యదర్శి లంబ ప్రవీణ్ యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటికి గ్రామాల్లో అర్గవర్ణాల రాజ్యం నడుస్తోంది, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఒకటైతే రాజ్యాధికారం మనదే అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని, ఆయన ఆశయ సాధనని ముందుకు తీసుకువెళ్లాలని అపుడే 85 శాతం ఉన్న మనం పాలకులం అవుతామన్నారు.
అంబేద్కర్ తప్ప భారతదేశానికి ఏ ఒకరు కూడా ఇలాంటి అద్భుతమైన రాజ్యాంగాని రచించలేకపోయేవారని పేర్కొన్నారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్య పరుస్తున్న యం.అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాస్, ఉపాధ్యక్షులు కడపోల్ల బిక్షపతి, నాయకులు కట్కూరి నర్సింగ్ రావు, ఎల్. ప్రవీణ్ యాదవ్, ఎం. రమేష్ యాదవ్, వి. ప్రణయ్ యాదవ్, జి. రోహిత్ యాదవ్, ఏ. సాయి యాదవ్, ఎల్. పవన్ యాదవ్, కడుపోళ్ల బిక్షపతి బండారి రాందాస్, మనోహర్ కుమార్ యాదవ్, కె. సత్యం, మీసాల రాజేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.






