8 March, 2026 | 1:43 AM

ప్రజా పాలన ప్రణాళిక ప్రారంభానికి పాలకవర్గం డుమ్మా

07-03-2026 12:00 AM
  1. హాజరుకాని చైర్మన్, వైస్ చైర్మన్.. అధికార పార్టీ కౌన్సిలర్లు 

హాజరైన ఇద్దరు బిఆర్‌ఎస్ ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ 

అచ్చంపేట, మార్చు 6: క్షేత్రస్థాయిలో ప్రజా అవసరాలను గుర్తించి.. దానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని ఉ ద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ’ప్రజాపాలన. ప్రగతి ప్రణాళిక’తో ప్రభుత్వం శ్రీకారం చు ట్టింది. 99 రోజులపాటు నిర్వహించే ఈ ప్ర త్యేక కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పా ల్గొనాలని సూచించింది.

పది వారాల పాటు నిర్వహించే కార్యక్రమంలో వివిధ అంశాలను గుర్తించి ప్రణాళికల రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కానీ అచ్చంపేట మున్సిపాలిలో శుక్రవారం ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ స భ్యులు దూరంగా ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ సైతం..

ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో అందరిని విస్మయానికి గురిచేసింది. వాస్తవానికి చైర్మన్ అ ధ్యక్షతన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రా రంభం కావాల్సి ఉంది. కానీ మున్సిపల్ చై ర్మన్ శ్రీనివాసులు వైస్ చైర్పర్సన్ శైలజా రెడ్డి, ఆ పార్టీకి చెందిన 15 మంది కౌన్సిలర్లు, ఇతర కోఆప్షన్ సభ్యులు గైర్హాజరు అయ్యా రు. మున్సిపాలిటీలో 20 మంది కౌన్సిలర్లు నలుగురు కోఆప్షన్ సభ్యులు ఉన్నారు.

వీరిలో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌ న్సిలర్లు మనోహర్ ప్రసాద్ పటేల్, రమేష్ రావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన గోపిశెట్టి శివ మాత్రమే హాజరయ్యారు. కార్యక్రమాన్ని ము న్సిపల్ మేనేజర్ రమేష్ నాయక్, ఏఈ రాజా నాయక్ లాంచనంగా ప్రారంభించా రు. కార్యాలయ సిబ్బంది, హాజరైన ముగ్గు రు కౌన్సిలర్లతో కలిపి ప్రతిజ్ఞ చేయించారు.

* ఇప్పుడే ఇలా..

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కానీ అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు.. కార్యక్రమానికి దూరంగా ఉండగా.. ప్రతిపక్ష పార్టీకి చెందిన టిఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఇద్దరు మాత్రం హాజరు కావడంపై అందరూ చర్చించుకుంటున్నారు. 

అచ్చంపేట మున్సిపాలిటీ ప్రస్తుత పాలకవర్గం గడువు ఈ ఏడాది మేతో మూయా నుంది. కేవలం మీరు పాలనకు మూడు నెలలు మాత్రమే మిగిలి ఉండడం.. చైర్మన్ తో సహా కౌన్సిలర్లు గైర్హాజరు కావడంపై అం దరూ ఆచార్యానికి లోనయ్యారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీరు పనితీరు ఎలా ఉంటుందో అని అందరిలోనూ చర్చ మొదలైంది. ఏదేమైనా ఎం తో కీలకమైన కార్యక్రమంలో అధికారపాటికి చెందిన సభ్యులే దూరంగా ఉండటంపై ఆ పార్టీకి చెందిన నేతలు సైతం అంతర్ మదనంలో పడ్డారు.